Virat Kohli: విరాట్ కోహ్లీ వల్ల విడిపోయిన ప్రేమజంట.. కారణమేంటంటే?

Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ వల్ల ఒక ప్రేమ జంట విడిపోయిందట. నిజానికి విరాట్ కోహ్లీ అంటే క్రికెట్ అభిమానులు చూపించే అభిమానం, ప్రేమ అంతా ఇంతా కాదు. మ్యాచ్ ఉందంటే చాలు ఎంత అత్యవసరమైన పని ఉన్నా సరే తమ అభిమాన ఆటగాడి కోసం ఎదురుచూస్తూ ఉంటారు ప్రేక్షక అభిమానులు. అలాంటిది విరాట్ కోహ్లీ వల్ల ఒక జంట విడిపోయింది.

తాజాగా కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. విరాట్ కోహ్లీ అభిమాని ఒకరు ప్లకార్డు పట్టుకుని వైరల్ గా మారాడు. అందులో తన గర్ల్ ఫ్రెండ్ తనను వదిలేసిందని.. ఎందుకంటే ఆమె కంటే ఎక్కువగా కోహ్లీ కే టైమ్ ఇస్తున్నానని.. తన మనసులోని భావాలను బయటకు పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.