లాక్ డౌన్ కారణంగా ఇంటికి పరిమితమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమయం దొరకడంతో ఇంట్లోనే ఉండి జిమ్ము..డైట్ ఫాలో చేసి 20 కేజీలు బరువు తగ్గానని మహానాడు సాక్షిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఉబ్బెత్తున పొట్ట..బొద్దుగా ఉండే లోకేష్ 60 రోజులు అనంతరం తమ కార్యకర్తలకు బరవు తగ్గిన దేహంతో కనిపించేసరికి ఎంత స్లిమ్ గా ఉన్నాడంటూ ఆనందందో ఉబ్బితబ్బిబారు. మా చినబాబులో కూడా కమిట్ మెంట్..డెడికేషన్ అంటూ కొన్ని లక్షణాలు ఉన్నాయని ఆనందపడ్డారు. ఏదైనా తలుచుకుంటే సాధించగలడు అన్న నమ్మకం చినబాబుపై కాస్తో కూస్తో పచ్చ తమ్ముళ్లకు మొన్నటి సందర్భంతో కలిగింది.
ఆరవై రోజుల్లో 20 కేజీలు తగ్గడం అంటే సామాన్య విషయం కాదని…గ్రేట్ లోకేష్ అంటూ ఆకాశానికి ఎత్తేసేంత అభిమానం చూపించారు ఇంకొంత మంది. అయితే ఆ అంచనాలన్నింటినీ తల్లకిందులు చేసేసారు వైకాపా మంత్రి కొడాలి నాని. లోకేష్ జిమ్ము చేసి..తిండి మానేసి తగ్గించిన శరీరం కాదది. లాక్ డౌన్ కారణంగా ఐస్ క్రీమ్ లు…బర్గరులు దొరకకపోవడంతో తగ్గిన బాడీ అదని విమర్శించారు. లేకపోతే కొన్ని సంవత్సరాలుగా 100 కేజీలు పైనుండే బాడీ రెండు నెలల్లో 20 కేజీలు బరువు తగ్గాడంటే? నిజంగా చమట చిందించే తగ్గించాడనుకుంటున్నారా? అని ఎద్దేవా చేసాడు. జిమ్ములో బాడీ తగ్గించడం అంటే ఐస్ క్రీమ్ లు తిన్నంత ఈజీ కాదు.
అదీ 20 కేజీలు తగ్గించాలంటే ఎంతలా శ్రమించాలో? కసరత్తులు చేసే వారికి తెలుస్తుంది. ఆ కుటుంబంలోనే హీరోలున్నారు కదా? అదెంత కష్టమైన పనో వాళ్లకి బాగా తెలుస్తుంది. లోకేష్ నిజంగా జిమ్ము చేసి తగ్గడా? లేక ఐస్ క్రీమ్ లు లేక తగ్గాడా? అన్నది అని వ్యగ్యంగా మాట్లాడారు. మొత్తానికి లోకేష్ కష్టపడి తగ్గించానని చెప్పినా నాని ఒప్పుకోలేదే. మరి నమ్మించడానికి లోకేష్ ఎం చేయాలంటారు? అని సోషల్ మీడియా వేదికగా కొంత మంది ప్రశ్నిస్తే …సినిమాల్లో హీరోల మాదిరి 50 కేజీల బరువును ఓసారి చొక్కా విప్పి ఎత్తితే జనాలు నమ్ముతారంటూ సెటైర్లు వేస్తున్నారు.