నారా లోకేష్ యొక్క రాజకీయ జీవితం చాలా ఆసక్తిగా మారింది. ఆయన తన తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలు చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోటీకి దిగుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వాడుకున్నారు కానీ తనకంటూ ప్రజల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ లోకేష్ మాత్రం టీడీపీ హయాంలో మినిస్టర్ గా విధులు నిర్వహించినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోలేదు. అయితే ఇప్పుడు టీడీపీ చాలా దీన స్థితిలో ఉంది. ఇలాంటి సందర్భంలో కూడా లోకేష్ రాజకీయాల్లో తన స్థాయిని తెలుసుకొని మసులుకోవడం చాలా అవసరం.
జగన్ తో పోల్చుకోవడం మానుకోవాలి
టీడీపీ నేతలు ఎప్పుడు లోకేష్ ను వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోల్చుతూ లోకేష్ కు ఒక ఊహాజనీతమైన హోదాను కలిపిస్తున్నారు. రాజకీయాల్లో లోకేష్ ఇప్పటికి వరకు ఒక్క సందర్భంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోలేదు. ఆయన చేసిన అన్ని పనులు కూడా చంద్రబాబు నాయుడు యొక్క కనుసన్నల్లోనే జరిగాయి. కాబట్టి రాజకీయాల్లో లోకేష్ ప్రత్యేకమైన గుర్తింపు లేదు. అయితే వైసీపీ నాయకుడిగా ఉంటూ ఒక పార్టీని నడిపించిన జగన్ మాత్రం రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలాంటి నేతతో టీడీపీ నాయకులు లోకేష్ ను పోల్చుతూ లోకేష్ ను నాశనం చేస్తున్నారు.
మాటల్లో కాదు పనుల్లో చూపించు లోకేష్
లోకేష్ తన తండ్రి అయిన చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకుంటే చాలు. ఎందుకంటే సీబీఎన్ కూడా చాలా కష్టపడి ఇప్పుడు ఆయన ఉన్న స్థాయికి చేరుకున్నారు. ఆయన రాజకీయాల్లో ఎక్కడా కూడా మాటలతో కాలక్షేపం చెయ్యలేదు. అలాగే ఇప్పుడు లోకేష్ కూడా ఉత్త మాటలు చెప్తూ కూర్చోకుండా ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారం కోసం పోరాడాలని రాజకీయ విశ్లేషకులు లోకేష్ కు సలహాలు ఇస్తున్నారు. అలాగే రాజకీయాల్లో తన స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని, ఎప్పుడు వైసీపీపై విమర్శలు చేయడమే కాకుండ పార్టీని నిర్మించుకోవడంలో దృష్టి పెట్టాలని సొంత పార్టీ నేతలు కూడా కోరుకుంటున్నారు.