ఎన్నో అడ్డంకులు, గొడవల తరువాత ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఈ స్థానిక ఎన్నికలు ఇప్పుడు బీజేపీకి అగ్ని పరీక్షలా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ నాయకులు కేవలం మాటలు చెప్తూనే కాలక్షేపం చేశారు. కానీ ఇప్పుడు బరిలో దిగి తమ సత్తా చాటుకొనే ధైర్యం మాత్రం బీజేపీ నాయకులకు లేదు.
ఇక బీజేపీ ఇంటికే…
2019 ఎన్నికల తరువాత ఏపీలో బీజేపీ పెద్దగాబలపడింది ఏమి లేదు. ఎన్నికలకు ముందు లేదా ఉందొ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇక్కడ బీజేపీని నడిపిస్తున్న సోము వీర్రాజు యొక్క విధానాలు ప్రజలను పార్టీ వైపు ఆకర్షించడం లేదు. అలాగే బీజేపీ నాయకులు చేస్తున్న కుల, మత రాజకీయాలను కూడా ఏపీ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. రానున్న రోజుల్లో వైసీపీకి తామే పోటీనని చెప్పుకున్న బీజేపీ ఒక్కసారిగా స్థానిక ఎన్నికలు రావడంతో బీజేపీ నాయకులు భయంతో వణుకుతున్నారు. తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది కానీ ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఈ స్థానిక ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను నిరూపించుకోకపోతే ఏపీలో బీజేపీ పూర్తిగా నాశనం ఐనట్టేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
బీజేపీ పతనం టీడీపీకి లాభం
బీజేపీ నాయకులు కేవలం మాటల్లోనే ముందుంటున్నారు కానీ చేతల్లో మాత్రం ఎక్కడో వెనక ఉంటున్నారు. అందుకే స్థానిక ఎన్నికలంటే బీజేపీ నాయకులు భయపడుతున్నారు. ఈ స్థానిక ఎన్నికలతో బీజేపీ యొక్క ప్రభావం ఎంత మేరకు ఉందొ తెలుస్తుంది. అయితే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అస్సలు ప్రభావం చూపదని, స్థానిక ఎన్నికల్లో పోటీ కేవలం వైసీపీ, టీడీపీ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇలా బీజేపీ రోజు రోజుకు పతనం అవ్వడం టీడీపీకి కలిసి వచ్చే అంశమని, లేకపోతే రానున్న రోజుల్లో బీజేపీ నుండి టీడీపీకి ముప్పు ఉండేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.