మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏపీలో మద్యం ధరలను ప్రభుత్వం సవరించింది. దీంతో మీడియం, ప్రీమియం బాటిళ్ల మీద 25 శాతం వరకు ధరలు తగ్గాయి.
అంటే 250 నుంచి 300 వరకు ధర ఉన్న మద్యంపై 50 రూపాయలను ప్రభుత్వం తగ్గించింది. తగ్గిన ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి.
మద్యం ధరలను తగ్గిస్తూ సవరించిన నోటిఫికేషన్ ను అబ్కారీ శాఖ రిలీజ్ చేసింది. అయితే.. వేరే రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రవాణా అవుతోందని.. దాన్ని అరికట్టేందుకే మద్యం ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
అయితే.. రెడీ టూ డ్రింక్ మద్యం ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే 200 రూపాయల లోపు ఉన్న క్వార్టర్ మద్యం ధరలో కూడా తగ్గింపు లేదు. బ్రాండ్స్, బాటిల్స్ పరిమాణాలను బట్టి ధరలను ప్రభుత్వం తగ్గించింది. ఒక ఫుల్ బాటిల్ మీద అత్యంత ఎక్కువ 1350 రూపాయలు.. 90 ఎంఎల్ మీద అత్యంత తక్కువ 50 రూపాయలను తగ్గించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.