Link Between Toliprema and Annamayya : బోడిగుండుకీ, మోకాలికీ లింకులు కలిపేస్తుంటారంటూ, కొన్ని సందర్భాల్లో ఈ నానుడిని తెగ వాడేస్తుంటారు. అస్సలు సంబంధం లేని పోలికలు పోలిస్తే ఆ సందర్భంలో మాత్రమే ఈ కొటేషన్ వాడాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కూడా అలాంటిదే.
ప్యూర్ లవ్ స్టోరీ అయిన ‘తొలిప్రేమ‘కీ, ఆధ్యాత్మిక చిత్రమైన ‘అన్నమయ్య‘కీ ఓ కామన్ పాయింట్ వుంది. అదేంటో తెలిస్తే నిజంగా షాకవ్వాల్సిందే మరి. ఈ రెండు సినిమాలూ మొదట్లో జనాలకి అస్సలు ఎక్కలేదు.
అన్నమయ్యని దేవుడి సినిమాగా లెక్కేశారు. కానీ, ఆ తర్వాత ఈ సినిమాకి యూత్ కూడా కనెక్ట్ అయ్యారు. అందుకు కారణం హీరోయిన్లతో నాగార్జున శృంగార సన్నివేశాలే. చాలా అద్భుతంగా, అటు ఫ్యామిలీ ఆడియన్స్‌నీ, ఇటు యూత్ ఆడియన్స్‌నీ కనెక్ట్ చేసేలా చాలా పక్కాగా ఆ సన్నివేశాలు తెరకెక్కించారు.
ఇక, ‘తొలిప్రేమ’ విషయానికి వస్తే, వన్ సైడ్ లవర్‌గా కనిపిస్తాడు ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్. లవ్‌లో విపరీతమైన పెయిన్ అనుభవిస్తుంటాడు. ఆ పెయిన్ ఆటోమెటిగ్గా కుర్రకారుకు కనెక్ట్ అవుతుంది. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోలేరు. మొదట్లో అదే జరిగింది. కానీ, పోను పోను ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు.
అలా మొదట్లో వచ్చిన రెస్పాన్స్‌కి భిన్నంగా ఈ రెండు సినిమాలూ సక్సెస్ బాట పట్టాయి. తిరుగులేని సక్సెస్ అందుకుని, వెండితెరపై అపురూపమైన దృశ్య కావ్యాలుగా నిలవడంతో పాటు, బాక్సాఫీసుకీ కాసుల వర్షం కురిపించాయి. (Link Between Toliprema and Annamayya)