Nagarjuna And Tabu : టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన నాగార్జున, అందాల భామ టబు కలిసి నటించిన సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్. యూత్‌లో పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది. నాగార్జున ఎవర్ గ్రీన్ మూవీస్‌లో ఈ సినిమా కూడా ఖచ్చితంగా వుంటుందనడం అతిశయోక్తి కాదేమో. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది.
ఆ సినిమా తర్వాత నాగ్, టబు ‘ఆవిడా మా ఆవిడే’ తదితర సినిమాల్లో నటించారు. ఆన్ స్ర్కీన్ వీరిద్దరి జంట ఓ ట్రెండ్ సెట్టర్. అలాగే, ఆఫ్ స్క్రీన్ కూడా నాగ్ – టబు మధ్య ఏదో వుందంటూ అప్పట్లో తెగ రూమర్లు వినిపించేవి. ఇప్పటికీ వినిపిస్తూనే వుంటాయ్ కూడా. ఎందుకిలా.?
నాగ్, టబు మధ్య అసలు ఎలాంటి సంబంధం వుంది.? అంటే.. ‘మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే’ అంటూ పదే పదే చెప్పుకొస్తుంటారు వీరిద్దరూ. అంతేకాదు, నాగ్ భార్య అమలకు కూడా టబు మంచి స్నేహితురాలు. అంతా బాగానే వుంది. కానీ, టబు ఇంతవరకూ పెళ్ళి చేసుకోలేదు ఎందుకు.?
అఫ్‌కోర్స్.. అది పూర్తిగా ఆమె వ్యక్తిగతం అనుకోండి. కానీ, ఈ వయసులోనూ వన్నె తరగని అందం టబు సొంతం. అందుకేనేమో ఆమె చుట్టూ ఇలాంటి రూమర్స్ పుట్టుకొస్తుంటాయ్. అలా అని ఎలాగంటే అలా రూమర్స్ క్రియేట్ చేయడం ఎంతవరకు సబబు చెప్పండి.
మరోవైపు వయసు మీద పడ్డా టాలీవుడ్ నవ మన్మధుడే నాగార్జున. బహుశా ఆయన హ్యాండ్సమ్ లుక్స్ కూడా ఆయన మీద ఇలాంటి గాసిప్స్ వస్తుండడానికి కారణమేమో.
ఇక, ప్రస్తుతం కెరీర్ విషయానికి వస్తే, ఇద్దరూ బిజీగానే వున్నారు. బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో పాటు, తెలుగులో రీసెంట్‌గా ‘అల వైకుంఠపురములో..’ సినిమాలో టబు నటించిన సంగతి తెలిసిందే. నాగార్జున ‘బంగార్రాజు’తో ఇటీవల సూపర్ హిట్ కొట్టాడు.