pawan kalyan : వద్దన్నా ఫ్యాన్స్ కి దెబ్బ మీద దెబ్బ కొడుతున్న పవన్..ఈ మేటర్ ఏంటో చూడండి!

pawan kalyan : టాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్ స్టార్స్ లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఇది అందరికీ తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ కి ఉన్న భారీ క్రేజ్ గాని తన సినిమా ఓపెనింగ్స్ గాని రికార్డు స్థాయిలో ఉంటాయి. అందుకే తనని కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని కూడా అనుకుంటారు. అదే తన లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” తో ప్రూవ్ అయ్యింది కూడా.
సరే ఇది పక్కన పెడితే పవన్ కి ఉన్న అభిమానులు అతడి పట్ల అన్ని విషయాల్లో హ్యాపీగా ఉన్నారా అంటే లేదనే చెప్పాలి. పవన్ తన కెరీర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో దాదాపు సగం రీమేక్ సినిమాలే కనిపిస్తాయి. ఒకప్పుడు అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం మరీ దారుణం అని చెప్పాలి.
ఆల్ మోస్ట్ అందరు చూసేసిన సినిమాలే మళ్ళీ రీమేక్ చెయ్యడం పైగా తెలుగులో కూడా రిలీజ్ అయ్యినవని చేస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ కి తల కొట్టేసినట్టు అవుతుంది. సోషల్ మీడియాలో ఇదే వాపోతున్నారు. మరి లాస్ట్ గా “భీమ్లా నాయక్” నే చివరి రీమేక్ ఇక డైరెక్ట్ సినిమాలపై పవన్ ఫోకస్ పెడతాడు అనుకుంటే మధ్యలో ఏకంగా మూడు రీమేక్ సినిమాలు పవన్ చెయ్యాలని చూస్తున్నాడట.
వాటిలో ఆల్రెడీ ఒకటి కన్ఫర్మ్ కూడా అయ్యింది. దీనితో పవన్ అభిమానులకి మాత్రం పవన్ దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడని చెప్పాలి. తన స్టార్డం ని చెత్త రీమేక్స్ కి వాడుతున్నాడని బాగా హర్ట్ అవుతున్నారు. మొత్తానికి అయితే పవన్ మాత్రం ఇవన్నీ ఆపుతాడో లేదో చూడాలి.