జీవితం చాలా నేర్పించింది : హీరో గోపీచంద్

టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట తొలివలపు సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తరువాత పలు సినిమాలలో నటీంచి మంచి గుర్తింపు తెచ్చు కున్నాడు. ఇకపోతే తాజాగా గోపీచంద్‌, రాశీ ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం పక్కా కమర్షియల్‌. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా జూలై 1న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా జబర్దస్త్ షోలో సందడి చేసారు గోపీచంద్, మారుతి. ఈ క్రమంలోనే తాజాగా క్యాష్ ప్రోగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను షో నిర్వాహకులు విడుదల చేశారు. హోస్ట్ సుమతో కలిసి గోపీచంద్, మారుతి, బన్నీవాసు, శ్రీనివాస కుమార్ కడుపుబ్బా నవ్వించారు. కార్యక్రమంలో భాగంగా గెస్టులకు సుమ కొన్ని గిఫ్ట్ లు ఇచ్చారు. ప్రతి దానికీ కమర్షియల్ అంటూ తాను ఇచ్చిన గిఫ్టులకు డబ్బులు అడిగారు. గిఫ్ట్‌లని చెప్పి మరీ డబ్బులు అడుగుతున్నారంటూ గోపీచంద్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ప్రోమో చివర్లో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ ఫొటోను చూపించారు.

ఆ ఫోటో చూసిన తర్వాత గోపిచంద్ చాలా ఎమోషన్ కి గురయ్యాడు. నా చిన్నతనంలో అంటే దాదాపు నేను తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. చిన్నప్పుడే జీవితం చాలా నేర్పించింది. నాకు ఇప్పుడు తెలుస్తోంది ఏం కోల్పోయానో మా నాన్నతో ఎక్కువ సమయం గడపలేకపోయాను అని ఎమోషనల్ అయ్యారు. ఇందుకుసంబందించిన ప్రోమో కూడా ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇటీవలే గోపీచంద్ సిటీ మార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.