Rashmika: సినీనటి రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక తెలుగులో అల్లు అర్జున్ సరసన ఈమె నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇక ఇటీవల పుష్ప 2 సినిమా కూడా మంచి విజయం అందుకున్న నేపథ్యంలో ఈమెకు వరుస సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో విక్కీ కౌశల్ హీరోగా నటించిన చావా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమె ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో యానిమల్ సినిమా తర్వాత ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మికకు మరింత పెరిగిపోయింది ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద ఎత్తున సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే ఈమె తాజాగా కొన్ని ట్రెడిషనల్ ఫోటోలను కూడా షేర్ చేశారు. పింక్ కలర్ చుడీదారిలో క్యూట్ ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…జీవితం ఎల్లప్పుడూ ఈ చిత్రాల వలెనే ఉండాలని నేను కోరుకుంటున్నాను.. కేవలం సంతోషంగా, ప్రకాశవంతంగా, ఉల్లాసభరితంగా అండ్ సరదాగా… మీరు అంగీకరిస్తున్నారా?’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.