RRR OTT Offer: ఆర్ఆర్ఆర్ ఓటీటీలో రిలీజ్ కు.. భారీ ఆఫర్ ను ప్రకటించిన ప్రముఖ సంస్థ..!

RRR OTT Offer: దేశ వ్యాప్తంగా ఎంతో ఆత్రుతగా చూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ లు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం పాత్రల్లో నటిస్తున్నారు. పిరియాడిక్ డ్రాగా ట్రిపుల్ ఆర్ రానుంది. అలియా భట్, ఒలివియా మోరిస్ వీరికి జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవ్ గన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే జనవరి 7న మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించినా.. కరోనా కారణంగా మరోసారి వాయిదా పడింది. దీంతో మరోసారి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాళ భాషలతో పాటు మరికొన్ని భాషల్లో సినిమాను రిలీజ్ చేయానలి మూవీ మేకర్స్ భారీగానే ప్రమోషన్లు చేశారు.

ఫ్రీరిలీజ్ ఈవెంట్లను పెద్ద ఎత్తున నిర్వహించారు. చెన్నై, ముంబై, త్రివేండ్రం, బెంగళూర్, హైదరాబాదుల్లో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. మూవీ యూనిట్ పడ్డ శ్రమంతా కరోనా వల్ల వ్యర్థం అయింది.

ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ …
ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ సినిమాకు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిందట. సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే రూ. 500 కోట్లు ఇస్తామని చెప్పారట. అయితే రాజమౌళితో సహా మూవీ మేకర్స్ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని భీష్మించుకున్నారు. అందుకే ఈ ఆఫర్ కు నోచెప్పారట మూవీ మేకర్స్. ప్రస్తుతం ఈవిషయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అయితే ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన 90 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ అవుతుందని మూవీ హిందీ డిస్ట్రిబ్యూటర్ సంస్థ పెన్ స్టూడియోస్ తెలిపింది.