లావణ్య త్రిపాఠి మనసులో ఉన్నదెవరో తెలుసా?

Lavanya Tripathi

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి తన చిలిపి నవ్వుతోనే ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించి. మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది  లావణ్య త్రిపాఠి. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఆమె తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంది.

Lavanya Tripathi
Lavanya Tripathi

ఈ క్రమంలోనే ఇటీవల పెళ్లి చేసుకున్న పలు సెలబ్రిటీల పెళ్లి విషయాన్ని కూడా  ప్రస్తావించింది ఈ ముద్దుగుమ్మ. రానా పెళ్లి ఫోటో చూసి ఆశ్చర్య పోయాను అంటూ తెలిపింది లావణ్య త్రిపాఠి. అంతే కాకుండా కాజల్ నితిన్ లు కూడా తమ సోల్ మేట్ ని పెళ్లి చేసుకున్నారు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలోనే తన జీవితంలో కూడా ఆ అందమైన రోజు వస్తుందని,  దాని కోసమే ఎదురు చూస్తున్నా అంటూ లావణ్య త్రిపాఠి తన మనసులోని మాటను  చెప్పుకొచ్చింది. మరి కాబోయే ఆ అందగాడు ఎవరో మాత్రం చెప్పలేదు. అడిగితే.. వెయిట్ అండ్ సీ.. అంటూ తప్పించుకుంటుదట. కాగా ప్రస్తుతం వరుసగా అవకాశాలు అందుకుంటూ మెల్ల మెల్లగా కెరీర్ లో  దూసుకుపోతుంది ఈ అమ్మడు.