అక్కడ ముందే ఏక్షన్ లో “హరిహర వీరమల్లు”..!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో తన మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. దీనిపై పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడిప్పుడే మరిన్ని మంచి అంచనాలు అయితే నెలకొంటుండగా రీసెంట్ గానే సినిమా షూటింగ్ కూడా చిత్ర బృందం అందరితో కలిసి స్టార్ట్ చేసారు.

అయితే ముందుగా కొత్త షెడ్యూల్ కోసం గాను వర్క్ షాప్ ని స్టార్ట్ చెయ్యగా ఇప్పుడు దీనిని కంప్లీట్ చేసి షూటింగ్ లో ఆల్రెడీ దిగారట. నిజానికి షూటింగ్ ని మేకర్స్ ఈ అక్టోబర్ మధ్యలో స్టార్ట్ చెయ్యాలి అనుకున్నారు కానీ పవన్ మాటతో ముందే స్టార్ట్ చేసేసారట.

మరి ఇప్పుడు సినిమా షూటింగ్ హైదరాబాద్ శారదా స్టూడియోస్ లో ప్లాన్ చేయగా అక్కడ పలు ఏక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. మరి ఈ 15న పవన్ పొలిటికల్ టూర్ లోపు పవన్ తో కావాల్సిన సీన్స్ తీసేస్తున్నారట. మొత్తానికి అయితే వీరమల్లు తో ముందే ఏక్షన్ స్టార్ట్ స్టార్ట్ అయ్యిపోయింది.

ఇక ఈ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా కీరవాణి అయితే సంగీతం అందిస్తున్నారు. అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం అందిస్తున్న సినిమాని వచ్చే ఏడాది వేసవి రేస్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారు.