Rashmika: సినీ నటి రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో తెలుగులో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ రష్మిక కెరియర్ పరంగా బిజీ అయ్యారు..
తెలుగులో కూడా ఈమెకు మంచి సినిమా అవకాశాలు రావడమే కాకుండా ఈమె నటించిన సినిమాలన్నీ కూడా సక్సెస్ కావడంతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలోను అదేవిధంగా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె నటిస్తున్న సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి.
యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక తాజాగా విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా ద్వారా మరో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రష్మిక షాకింగ్ డేసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయం అందుకోవడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రష్మిక బాలీవుడ్ సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇలా వరుస బాలీవుడ్ సినిమాలకు ఈమె కమిట్అయితే ఇకపై తెలుగు సినిమాలలో నటించడం కూడా కష్టమేనని తెలుస్తుంది. ఇలా తెలుగు సినిమాలలో రష్మిక నటించకపోతే కచ్చితంగా ఆమె అభిమానులు తనని ఎంతగానో మిస్ అవుతారు. ఇలా రష్మిక బాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.
