Raviteja: రవితేజ కెరియర్ ను నాశనం చేసిన చెత్త రూమర్…. ఎప్పటికీ మర్చిపోలేరుగా?

Raviteja: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీల విషయంలో ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి ఇలా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీల గురించి రూమర్లు రావడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం అయితే కొన్ని రూమర్లు సెలబ్రిటీలు కానీ అభిమానులు కానీ జీర్ణించుకోలేకపోతు ఉంటారు అలాంటి చెత్త రూమర్లు బయటకు వచ్చినప్పుడు ఆ రూమర్లపై సెలబ్రిటీలు సైతం చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు.

ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి రూమర్ల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తన స్వసక్తితో ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు రవితేజ ఒకరు. సాధారణంగా రవితేజ ఎలాంటి వివాదాలకు వెళ్లారు. అలాగే ఈయన గురించి పెద్దగా రూమర్లు కూడా బయటకు రాలేదు కానీ ఒక్క రూమర్ మాత్రం రవితేజ కెరియర్ పై చాలా దెబ్బ కొట్టింది అని చెప్పాలి.

రవితేజ తన కెరియర్లో ఎన్నో ఎత్తు పల్లాలను చూస్తూ ఈ స్థాయికి వచ్చారు. ఈయన ఇటీవల కాలంలో పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే చాలా వరకు ఈయన ఫ్లాప్ సినిమాలనే ఎదుర్కొన్నారు. చివరిగా ధమాకా సినిమాతోనే ఈయన హిట్ అందుకున్నారని చెప్పాలి. అయితే ధమాకా సినిమా సమయంలో రవితేజ శ్రీ లీల గురించి ఒక చెత్త రూమర్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో రవితేజ శ్రీ లీల కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా వర్కౌట్ అయిందని చెప్పాలి అలాగే వీరిద్దరి మధ్య కాస్త చనువు కూడా ఉండటంతో రవితేజ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారని శ్రీ లీలతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు బయటకు వచ్చింది ఇది విన్నటువంటి అభిమానులు ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా ఇలాంటి రూమర్లను క్రియేట్ చేయడం సరికాదు అంటూ ఖండించారు. అయితే ఇదంతా కేవలం రూమర్ మాత్రమేనని తెలిసినప్పటికీ కూడా అభిమానులు తమ అభిమాన హీరో గురించి వచ్చినటువంటి ఈ వార్తను మాత్రం అసలు జీర్ణించుకోలేక పోయారని చెప్పాలి. అయితే ఇప్పుడు మరోసారి శ్రీ లీలతో కలిసి రవితేజ మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.