ప్రభాస్ వరల్డ్ ప్రాజెక్ట్ పై హాట్ టాపిక్..క్రేజీ వీడియో ఒకటి బయటకి.!

ఇప్పుడు కొందరు హీరోలు అభిమనులు పాన్ ఇండియా స్టార్స్ అంటూ గొడవలు పడుతున్నారు కానీ ప్రస్తుత ట్రెండ్ లో మాత్రం పాన్ ఇండియా లెవెల్లో మొట్ట మొదటి ఏకైక పాన్ ఇండియా స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్ అనే చెప్పాలి.

బాహుబలి సినిమాలత్తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన డార్లింగ్ ఇప్పుడు ఏకంగా పలు వర్ల లెవెల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఈ చిత్రాల్లో మొదట ఆదిపురుష్ తోనే ప్రభాస్ తన వరల్డ్ ఎంట్రీ ఇవ్వనుండగా నెక్స్ట్ మాత్రం “ప్రాజెక్ట్ కే” దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న సినిమాతో ఇవ్వబోతున్నాడు.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాగా ఈ షెడ్యూల్ పై హాట్ టాపిక్ గా ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో వందలాది మంది ఆర్టిస్టులతో అంతా హడావుడిగా ఉండగా ప్రభాస్ మరియు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె సీన్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది.

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ క్రేజీ వీడియో షేక్ చేస్తుంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కె సెట్స్ లోకి వస్తున్న వీడియో అంటూ తన కార్ లో రయ్ మని దూసుకెళ్ళిపోతున్న వీడియో ఇది. మరి చూస్తే ప్రభాస్ ఫాన్స్ కి వెంటనే ఫుల్ కిక్ వచ్చేస్తుంది. అందుకే ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యిపోయింది.