ఇండస్ట్రీ టాక్ : చిరు మాస్ సినిమా రిలీజ్ వాయిదా పడిందా.?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ హిట్ సినిమా గాడ్ ఫాదర్ తో అయితే మళ్ళీ తాను ట్రాక్ లోకి వచ్చారు. దీనితో మెగా ఫాన్స్ లో కూడా కొత్త ఉత్సాహం స్టార్ట్ కాగా ఇక అభిమానులు మెగాస్టార్ నెక్స్ట్ సినిమా కోసం భారీ అంచనాలు నెలకొల్పుకొని ఎదురు చూస్తున్నారు.

మరి మళ్ళీ వింటేజ్ బాస్ నే చూపిస్తున్నట్టుగా దర్శకుడు బాబీ చిరు కెరీర్ లో 154వ సినిమాని తెరకెక్కిస్తుండగా ఇప్పుడు సినీ వర్గాల్లో అయితే ఈ సినిమాపై పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నామని ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు.

ఇప్పుడు అయితే సినిమాకి ఉన్న బాలన్స్ వర్క్ తో ఇది సాధ్యం కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో సినిమా వాయిదా పడే ఛాన్స్ కూడా ఉందని టాక్. అయితే ఇది అయితే కాలేదు కానీ మెగా కాంపౌండ్ నుంచి కొన్ని వర్గాల సమాచారం అయితే సినిమా సంక్రాంతి బరిలోనే ఉంటుంది అని అంటున్నారు.

మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మాస్ మహారాజ రవితేజ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడు.