ప్రభాస్ భారీ సినిమాపై వైరల్ అవుతున్న బడ్జెట్..ఇతర కీలక వార్తలు ఇవే.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తున్నాడో చూస్తున్నాము. ఒక పక్క ప్లాప్ పడుతున్నా కూడా ఒకదాన్ని మించి ఒకటి ప్రపంచ స్థాయి వరకు సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాల్లో ప్రతి సినిమా భారీ బడ్జెట్ లోనే ఉన్నాయి. అయితే ఓ సినిమా కోసం మాత్రం ఫ్యాన్స్ సహా ఇండియన్ ఆడియెన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

ఆ సినిమానే బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ చేసిన భారీ పాన్ ఇండియా సినిమా “ఆది పురుష్”. రామాయణం ఆధారంగా ప్రభాస్ రాముడిగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జానకి పాత్రలో నటించిన ఈ సినిమా పై నిర్మాత భూషణ్ కుమార్ పలు ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ లు ఇవ్వడం ఇండియా వైడ్ సినిమా దగ్గర ఆసక్తిగా మారాయి. ఈ సినిమాపై ఉన్న రూమర్స్ ని నిజం చేస్తూ ఈ సినిమాని తాము 500 కోట్ల భారీ వ్యయంతో నిర్మించామని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు, వి ఎఫ్ ఎక్స్ పనుల్లో ఉన్నామని తెలిపారు.

అంతే కాకుండా అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్స్ అన్ని అక్టోబర్ నెల నుండి స్టార్ట్ అవుతాయని ఇంకో బిగ్ క్లారిటీ ఇచ్చారు. అలాగే జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ ఉంటుంది అని సినిమా అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది అని 3డి లో అంతా బాగా ఎంజాయ్ చేస్తారని తెలిపారు. ఇంకా ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటిస్తుండగా మరింతమంది కీలక పాత్రల్లో నటించారు.