రెండేళ్లు పార్టీ కోసం కష్టపడితే కనీస గౌరవం అనేది లేకుండా తనను పక్కకు పెట్టటంతో కన్నా లక్ష్మి నారాయణ బీజేపీ మీద అలకబూనినట్లు సమాచారం. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటూ వస్తున్నాడు. గతంలో అధ్యకుడిగా తాను చేసిన వ్యాఖ్యలకు, తాను ఇచ్చిన మాటలకూ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు విలువ లేకుండా చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడంటా కన్నా.
కన్నాఅలా …సోము ఇలా
ఎన్నికల అనంతరం టీడీపీ విషయంలో తాను ఒక వ్యూహాన్ని అమలు చేస్తే ఇప్పుడు సోము దానికి విరుద్ధంగా వెళ్తున్నాడు, అదే విధంగా కన్నా హయాంలోనే జనసేన తో పొత్తు కుదుర్చుకొని బీసీ లకు దగ్గర అవుతూ బలమైన శక్తిగా ఎదగాలని అనుకుంటే, ఇప్పుడు సోము వీర్రాజు దానిని కూడా ఇరకాటంలో పెట్టేలా కనిపిస్తుందని, అధ్యక్ష పదవి నుండి తప్పుకున్న నాటి నుండి తనకు పార్టీలో సరైన గౌరవం లేదని, మున్ముందు రోజుల్లో కూడా తనకు తగిన స్థానం బీజేపీ లో లభించటం కష్టమే అని కన్నా లక్ష్మి నారాయణ బలంగా భావిస్తున్నట్లు తెలుస్తుంది.
కన్నా ఆలోచన ఏమిటి
ఈ నేపథ్యంలో బీజేపీ కి స్వప్తి చెప్పేసి మరో పార్టీలోకి వెళితే ఎలా ఉంటుందో అనే ఆలోచన కన్నా చేస్తున్నట్లు గుసగుసలు. నిజానికి కాంగ్రెస్ నుండి బయటకు రాగానే వైసీపీ లోకి వెళ్లాలని అనుకున్నాడు, కానీ జగన్ నుండి సానుకూలమైన సమాచారం రాలేదు, ఇదే సమయంలో అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి బీజీపీ రాష్ట్ర బాధ్యతలను అప్పగిస్తానని చెప్పడంతో అప్పట్లో మనసు మార్చుకుని బీజేపీ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు కూడా వైసీపీ నుండి ఎలాంటి సానుకూలత కనిపించటం లేదు. కాబట్టి బీజేపీ నుండి బయటకు వస్తే ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీ.
సహనం అవసరమా ..?
కాకపోతే ఇప్పుడే బయటకు రావటం కంటే కూడా కొన్ని రోజులు ఓపిక పట్టే ఉద్దశ్యంతో కన్నా ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది లో ఉత్తర ప్రదేశ్ లో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి, అందులో 8 స్థానాలు బీజేపీ కి రానున్నాయి. ఆ కోటాలో ఆంధ్రకు ఒక రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇందులో ఏమైనా తనకు ప్రాధాన్యత ఇస్తూ రాజ్యసభకు పంపిస్తే పంపినట్లు లేకపోతే ఇక బీజేపీ కి రాజీనామా చేసి 2024 ఎన్నికల సమయానికి మరోసారి అసెంబ్లీ కి పోటీచేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలనే ఆలోచనలో కూడా కన్నా ఉన్నట్లు తెలుస్తుంది