శ్రీకాకుళం జిల్లా అముదాల వలస టీడీజీ మాజీ ఎమ్మెల్యే కూన రవి పేరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. పొందురు మండలం ఎమ్మార్వో పై దురుసు ప్రవర్తన కారణంగా వెలుగులోకి వచ్చిన కూనరవి తాజాగా అదే మండలానికి చెందిన గుడ్ల రామోహన్ పై బెదిరింపులకు పాల్పడినట్లు ఓ వాట్సాప్ ఆడియో టేపు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయింది. పొందురులో కూన పార్టీ కార్యాలయం విషయంలో ఇరువురి మధ్య వివాదం తలెత్తడంతో మోహన్ రావుని బెదిరించినట్లు తేలింది. పార్టీ కార్యలయాన్ని ఖాళీ చేయాలని మోహన్ రావు కోరడంతో కూన రవి అతనిపై దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలిసింది.
అయితే దీనిపై కూన రవి విరణ ఇవ్వడం జరిగింది. ఇద్దరు పార్టనర్లుగా కొన్ని బిల్డింగ్ పై మోహన్ రావు మాటలు మార్చి, వైకాపా నేతలు ప్రోత్భలంతోనే ఇలా మాట మారుస్తున్నారని కూన రవి అన్నారు. తాజాగా కూనరవి ఈ వివాదంపై మరింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు. ఆ బిల్డింగ్ ఓనర్ విజనగరం చెందిన వ్యక్తి అని, మోహనరావు-కూన రవి భాగస్వాములుగా కొనుగోలు చేయాలని భావించి ఆవిధంగా కొనుగోలు చేసామన్నారు. దానికి సంబంధించిన పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయని కూనరవి తెలిపారు. మోహనరావు తో ఎన్నో ఏళ్లగా పరిచయం ఉందని, తనకి అన్ని రకాలు సహకారం అందించానని, ఆయన ఎదుగుదలకు తానే కారణమని కూన రవి తెలిపారు.
అయితే ఆయనకు ఓ సినిమా థియేటర్ విషయంలో వైకాపా నుంచి సమస్యలు రావడంతో ఆ పార్టీ ఒత్తడి మేరకు అందులో చేరారని, అప్పటి నుంచి తన పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనంతటి వెనుక స్పీకర్ తమ్మినేని సీతారం ఉన్నారని ఆరోపించారు. ఆయన చేయిస్తున్న క్షక్షసాధింపు చర్యగా చెప్పుకొచ్చారు. తమ్మినేని పై చట్టపరమైన చర్యలు తీసుకుంటా నన్నారు. అలాగే తమ్మినేనిని తప్పకుండా నడిరోడ్డుపై నడిపిస్తానని కూన రవి వార్నింగ్ ఇచ్చారు. తన మాట కఠువుగా ఉన్న అందులో వాస్తవాలు ఉంటాయని అన్నారు. తప్పును తప్పు అని ప్రశ్నించడం తప్పా? అని మండిపడ్డారు కూన.