KTR: తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో తెరాస మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంలో ఆయన బీజేపీ, కాంగ్రెస్ నేతలపై మంది పడ్డారు. రాష్ట్రంలోకి ఈ మధ్య పొలిటికల్ టూరిస్టులు వచ్చి ప్రభుత్వంపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టారు. తెరాస ప్రభుత్వమంటే రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు.
ఉమ్మడి పాలనలో తెలంగాణ రైతులు నానా కష్టాలు పడ్డారని, పండిన పంటకు కనీస మద్దతు ధర కూడా ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాలలో రైతులకు చేసింది, చేస్తుందేంటో చెప్పాలని? దీనిపై చర్చకు సిద్ధమా? అంటూ సవాళ్లు విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ విభాగాలకు 2.5 లక్షల కోట్లు పైగా ఖర్చు చేశామన్నారు. అంతేకాకుండా 64 లక్షల మంది రైతుల ఖాతాలోకి 50 వేల కోట్లు జమ అయ్యిందని తెలిపారు.
తమది శ్వేతపత్రాల ప్రభుత్వమని, బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు చేస్తుందని విమర్శించారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను గందగోళపరచటం సరికాదన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రం రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేఖ చట్టాలు చేస్తూ, ప్రశ్నించిన రైతులను హింసించిందన్నారు. రైతులకు బీజేపీ బీజేపీ చేసిన మేలేంటో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. మీకు మాకు అసలు పోలికే లేదన్నారు.