KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వ తీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఈయన ట్విట్టర్ వేదిక గారు రేవంత్ సర్కారు తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎన్నో తప్పుడు హామీలను ఇచ్చారు. ఇలా తప్పుడు హామీల కారణంగా అధికారంలోకి వచ్చి ఇప్పుడు తమను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు కేటీఆర్ మండిపడ్డారు.
అబద్దపు హామీలు నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తం కాటేస్తుందన్నారు. 420 హామీల కాంగ్రెస్ పాలనో రైతుభరోసా రూ.15 వేలు రాలేదని, రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని, 24 గంటల ఉచిత కరెంటు మాయమైందని విమర్శించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం లేదు అలాగే వరి ధాన్యం క్వింటాలుకు బోనస్ రూ.500 ఇయ్యలేదన్నారు. జాగో తెలంగాణ అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
ఇక ఇటీవల రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి అనూహ్య నిర్ణయాల పట్ల కేటీఆర్ అలాగే బిఆర్ఎస్ నాయకులు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల కొడంగల్ లగచర్ల గ్రామస్తుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రశ్నించారు ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భారీ స్థాయిలో భూసేకరణ అంటూ తమ సొంత లాభాల కోసం రైతుల నుంచి భూములను లాక్కుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఇక లగచర్ల గ్రామ విషయంలో ఎంతోమంది రైతులను అరెస్టు చేయగా కేటీఆర్ అరెస్టుకు కూడా రంగం సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలపై కూడా కేటీఆర్ స్పందించారు రైతుల కోసం తాను జైలుకు వెళ్లాల్సి వస్తే గర్వంగా జైలుకు వెళ్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక కేసులో నన్ను ఇరికించి అరెస్టు చేస్తారనే విషయం నాకు తెలుసని కేటీఆర్ వెల్లడించారు.