KTR: అదానీ ఇష్యూలో జగన్ ఇన్వాల్వ్… సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్?

KTR: ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త అయినటువంటి అదానీ కేసు వ్యవహారం అటు అమెరికాలోని ఇటు ఇండియాలోనూ సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై పలు రాజకీయ పార్టీలు స్పందిస్తూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ విషయంపై సుదీర్ఘమైన చర్చలు జరుగుతున్నాయి.

అదానీ విషయంలో ముఖ్యంగా కేంద్రంలో మోడీ పైనా.. ఇటు ఏపీలో జగన్ పైనా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ స్కామ్ పేరు చెప్పి ఫైరవుతున్నాయి. ఇలా ఈ విషయం గురించి తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఈ సందర్భంగా ఈయన జగన్ పేరును ఉచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ విషయంలో జగన్ అయినా చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అని అన్నారు.

అదానీ ముడుపులు ఇచ్చారని నిన్న కోర్టు చెప్పింది.. అట్లాగే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమనండి.. చెప్పిన తర్వాత డెఫనెట్ గా చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం, న్యాయం ఏం చేయాలో అదే చేయాలి .ఈ విషయంలో ఏది జరగాలో అదే జరగాలని తెలిపారు. ఈ వ్యవహారంలో లంచం ఎవరికిచ్చినా సరే మీరన్నట్టు అది జగన్మోహన్ రెడ్డికైనా ఇంకొకరికైనా తప్పకుండా చర్య తీసుకోవాలని ఆ విషయంలో నేను కూడా ఇదే కోరుకుంటున్నానని కేటీఆర్ తెలిపారు..

కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఖండించడాలు ఉండవు.. తీర్పు వచ్చిన తర్వాత అప్పీలుకు పోవాలి అని వ్యాఖ్యానించారు. ఈ ముడుపులలో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సుమారు 1,750 కోట్లు లంచం ఇచ్చారనీ ఏపీ విపక్షాలు ఈ విషయం గురించి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి తన అక్రమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని మండిపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం మోదానీ లిస్ట్ లో మరో స్కామ్ వచ్చి చేరింది.. అయినా కూడా అదానీకి ఏమీ కాదు.. ఆయనకు ఏమీ కాకుండా మోడీ చూసుకుంటారు అంటూ విమర్శలు కురిపిస్తుంది.