KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్ కి పరిశ్రమలను తీసుకు రావడం కోసం ఎంతోమంది పారిశ్రామిక వ్యక్తులతో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
గత ప్రభుత్వ హయాంలో ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయన కేవలం ఐటి ఉద్యోగి అంటూ చెప్పుకు వచ్చారు. ఇలా తనని ఐటి ఉద్యోగి అని చెప్పడంతో కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నన్ను కేవలం IT ఉద్యోగి అని పిలవడం ద్వారా నన్ను తక్కువ చేసి చూపుతారని భావించే వారికి నేను ఇలా చెప్తాను. ఐటీ పరిశ్రమలో భాగం కావాలి అంటే ఎంతో నైపుణ్యం, విద్య, ప్రతిభ అన్నింటికీ మించి అంకితభావం ఎంతో అవసరమని తెలిపారు.
ఐటీ ఉద్యోగం అంటే ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడానికి, డబ్బు సంచులు మోయడం లేదా ఢిల్లీ బాస్‌లకు చెల్లించడం లాంటివి కాదు ఐటీ ఉద్యోగం మంటే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణులు కష్టపడి పని చేయడం, తెలివితో జీవనోపాధి పొందుతున్నారు. IT మరియు ITES పరిశ్రమలోని నా తోటి సోదరులు మరియు సోదరీమణులకు, నేను మీకు నమస్కరిస్తున్నాను.
ఎలాంటి విశ్రాంతి లేకుండా మీ తెలివైన మనస్సులు ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నెముక. మీరు లేకుండా, ఆవిష్కరణ మరియు పురోగతి యొక్క చక్రాలు ఆగిపోతాయి నిజాయితీగా ఉండండి. నా మూలాలు, నా విద్య, నా పని అనుభవం, నా సాంకేతిక నేపథ్యం మరియు నా సహచరుల గురించి నేను నిస్సందేహంగా గర్విస్తున్నాను అంటూ ఈ సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.