Shyamala Devi: ఆ కంటెస్టెంట్ కు మద్దతు తెలిపిన కృష్ణంరాజు భార్య శ్యామల దేవి..!

Shyamala Devi: బుల్లితెర ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ కార్యక్రమం మరొకరు మూడు రోజులలో ముగుస్తుంది. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడటమే కాకుండా పలువురు సెలబ్రిటీలు సైతం బయట వీరి కోసం ఎంతో శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సైతం రంగంలోకి దిగి వారికి ఇష్టమైన కంటెస్టెంట్ లకు మద్దతు తెలుపుతూ వారి అభిమానులను కూడా వారికి ఓటు వేయమని సూచిస్తున్నారు. ఇక సిరి కోసం శ్రీహాన్, షణ్ముఖ్ కోసం దీప్తి సునైనా,వంటి వారు ఇప్పటికే రంగంలోకి దిగి పెద్దఎత్తున సోషల్ మీడియాలో వారికి మద్దతు తెలుపుతున్నారు. ఇక యాంకర్ రవి సైతం కంటెస్టెంట్స్ శ్రీ రామచంద్రకు మద్దతు తెలుపుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ నటుడు కృష్ణం రాజు భార్య శ్యామలాదేవి సైతం మొట్టమొదటిసారి ఈ కార్యక్రమంలో స్పందించి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ సింగర్ శ్రీరామచంద్రకు తన మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. హాయ్ శ్రీరామచంద్ర నేను నీ కార్యక్రమం అన్ని చూస్తుంటాను. పాటలు ఎంతో అద్భుతంగా పాడుతావు. ముఖ్యంగా కృష్ణం రాజు గారికి కూడా నీ పాటలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు.

గతంలోనూ ఇండియన్ ఐడల్ వెళ్లి అక్కడ గెలిచి తెలుగు వారందరికీ ఎంతో గర్వ కారణం అయ్యావు.ఇక బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఆమె మాట్లాడుతూ ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచిన విధంగానే బిగ్ బాస్ టైటిల్ కూడా గెలవాలని అందరూ నీకు ఓటు వేసి గెలిపించాలని మా ఫ్యామిలీ తరపున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నువ్వు తప్పకుండా విన్ అవుతావు అంటూ శ్రీరామచంద్రకు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఆశీర్వదించారు. ఇదివరకే కంటెస్టెంట్ శ్రీరామచంద్రకి సోనూ సూద్ మద్దతు తెలపగా, కృష్ణం రాజు భార్య కూడా మద్దతు తెలపడంతో వీరి అభిమానులు సైతం శ్రీ రామచంద్రకు సపోర్ట్ చేస్తారని చెప్పవచ్చు.