ఎన్టీఆర్ కొరటాల సినిమా సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల విశేషమైన ప్రేక్షకాదరణ పొందింది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కోసం కొరటాల ఎంతో అద్భుతమైన కథను సిద్ధం చేశారని తెలుస్తోంది.ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఇద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాల గురించి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ కావడంతో ఎన్టీఆర్ విషయంలో కొరటాల ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం సుమారు ఎనిమిది కిలోల వరకు బరువు తగ్గినట్లు సమాచారం. ఇలా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ భారీ కసరత్తులు చేస్తున్నారు.ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా విడుదల అయ్యి రెండు నెలలు కావస్తోంది. అయినా కొరటాల శివ ఇప్పటికి తన సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్ళలేదు. దీంతో ఈ షూటింగ్ ప్రారంభమయ్యేది ఎప్పుడూ అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.

ముందుగా ఈ సినిమాని జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని మేకర్స్ తెలియజేశారు. అయితే తాజాగా ఈ సినిమా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జూలై నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని, జూలై నెలలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుందని ప్రకటించారు.ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే కథానాయిక గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కొందరు ఆలియా పేరు ప్రస్తావించగా, మరికొందరు రష్మిక పేరు ప్రస్తావిస్తున్నారు. కొరటాల మాత్రం కియారా అద్వానీను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాన్ని ఎవరు దక్కించుకుంటారో తెలియాల్సి ఉంది.