Konda Murali: బాడీలో 47 బుల్లెట్లు దిగినా… కుటుంబం కోసం కాదు వారి కోసం బతికాను: కొండా మురళి

Konda Murali: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా కొండా. ఈ సినిమాలో మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. ఈ సినిమాలో శ్రేష్ట పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్ జీవి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను హనుమకొండలోని కొండా ఆఫీసులో విడుదల చేశారు. ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ గురించి, సినిమాలో పలు సన్నివేశాల గురించి తెలిపారు.

కొండా మురళి మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ కు రెండు ముక్కలు చెబితే.. ఆయన ఎంతోమంది దగ్గర సమాచారాన్ని ఎంక్వైరీ చేసి కన్ఫామ్ చేసుకొని సినిమాలు చేశారు. వరంగల్లో దాదాపుగా రెండు నెలల 16 రోజులు ఉండి షూటింగ్ చేశారు. షూటింగ్ సమయాలలో ఎక్కడా కూడా అన్ని రోజులు ఉండని రామ్ గోపాల్ వర్మ ఇక్కడ రెండు నెలలు ఉన్నారు అంటే కథ ఆయనకు ఇంత బాగా నచ్చింది అర్థం అవుతోంది. ఇదే జనవరి 26న నామీద 47 బుల్లెట్ ఫైరింగ్ చేశారు. అయినప్పటికీ నేను బతికాను.. అది కూడా మా కుటుంబం కోసం కాదు.. ప్రజల కోసం అని తెలిపారు కొండా మురళి. ఈ సినిమా గురించి చెప్పడం కన్నా సినిమాను థియేటర్ లలో చూస్తే బాగుంటుంది.

ఇందులో త్రిగుణ్ బాగా నటించాడు.. అదేవిధంగా సురేఖ కంటే ఇర్రా మోర్ చాలా అందంగా ఉంది.. అలాగే అద్భుతంగా నటించింది అని చెప్పుకొచ్చారు కొండా మురళి. అనంతరం సురేఖ మాట్లాడుతూ.. ట్రైలర్ ను చూసిన తర్వాత మేము ఎంత బాధ అనుభవించాను అన్నది గుర్తుకు వచ్చింది..ట్రైలర్ చూడగానే ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాను అని చెప్పుకొచ్చింది. అందులో ముఖ్యంగా ఫైరింగ్ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడింది.