భార్య గురించీ చెప్తూ ఎమోషనల్ అయిన కొమురం.. ఆమె లేకపోతే నేనులేను?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి జీవితాలను ఇచ్చింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ షో ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఎన్నో కుటుంబాలలో వెలుగు నింపింది. జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది లేడి గేటప్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్నారు. అలా లేడి గెటప్ తో అందరినీ ఆకట్టుకున్న వారిలో కొమరం కూడా ఒకరు. బుల్లితెర మీద కోమరక్కగా గుర్తింపు పొందిన కొమరం బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవి షోలలో లేడి గెటప్ తో సందడి చేసాడు.

తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ ప్రోగ్రాం లో కొందరు కమెడియన్లు తమ భార్యలతో కలిసి సందడి చేశారు. కొమరం అతని భార్య అనిత కూడ ఈ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ షోలో సుమ ఆడించిన ఫన్నీ టాస్క్ లు , ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో సుమ మాట్లాడుతూ.. అవకాశం వస్తే మీరు మీ భర్తలను అమ్మటానికి సిద్దంగా ఉన్నారా అని ప్రశ్నించగా.. అందరు అమ్మమని చెప్పారు. కానీ శాంతి కుమార్ మాత్రం తన భార్య ఈ అవకాశం కోసం ఎదురు చూస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ షో ఏంతో సరదాగా సాగిపోయింది.

ఇదిలా ఉండగా క్యాష్ షో లో కొమరం తన భార్య అనిత గురించి మాట్లాడుతూ స్టేజి మీదే కన్నీళ్ళ పెట్టుకున్నాడు. తానూ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి తన భార్యే కారణం అంటూ చెప్పుకొచ్చాడు. తనకి ఇష్టమైన సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తన భార్య ఎంతో సహాయం చేసిందని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెళ్తాను అని చెప్పినప్పుడు.. మూడేళ్లు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చెయ్యి.. నా గురించి, పిల్లల గురించి మర్చిపో.. అప్పటికి నీకు అవకాశాలు రాకపోతే తిరిగి వచ్చెయ్యి అని చెప్పింది. ఐదేళ్లు రాత్రింబవళ్లు టైలరింగ్ చేసి నాకు నెలకు రూ.3 వేలు అకౌంట్ లో వేసేది’ అంటూ కొమరం చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. నా భార్య సపోర్ట్ లేకపోతే నేనూ ఏమయ్యే వాడినో అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.