తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని కేసీఆర్ అక్కడి ప్రజలకు దేవుడైపోయాడు. ఆ కృతజ్ఞతతోనే రెండుసార్లు ఆయన్ని సీఎంగా గెలిపించి నెత్తిన పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తారా? లేదా? అని మీడియా కథనాలు వేడెక్కించిle అంతిమంగా మళ్లీ పట్టం ఆయనకే కట్టారు. ఇక మొదటి నుంచి అక్కడ సరైన ప్రతిపక్షం గానీ…కేసీఆర్ చర్యలను తిప్పికొట్టే నాయకుగానీ లేడు. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ కు జంప్ అయిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ కి సరైన పోటీ ఇతనేనే బలంగా వినిపించింది.
కాంగ్రెస్ ఇతని హయాంలో కచ్చితంగా బలోపేతం అవుతుందని ఓ నమ్మకం ఏర్పడింది. దేశంలో అతి పెద్ద ఎంపీ నియోజక వర్గమైన మల్కాజీగిరి ని కైవసం చేసుకుని రేవంత్ కాంగ్రెస్ కు ఓ భరసో కల్పించారు. కానీ అధికార పక్షం ముందు ప్రతిపక్ష నాయకుడెంత? ప‌్రస్తుతం రేవంత్ పరిస్థితి అదే. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు ఎంత గట్టిగా టీఆర్ ఎస్ ని వారించినా..ఆ గళం ప్రజలకు చేరడం లేదన్నది తెలిసిందే. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పీసీసీ పదవి రేసు మొదలైంది. అదిష్టానం అండతోఆ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. పదవి కోసం పార్టీలో పండిపోయిన నేతలంతా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిని తానే నంటూ భువనగిరి ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత కొమటిరెట్టి చాటింపు వేసుకుంటున్నారు.
సాక్షాత్తు ఓ ఇంటర్వూలోనే ఈ విషయం చెప్పారు. తాను పీసీసీ అయితే గనుక టీఆర్ఎస్ నుంచి 50 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వైపు తీసుకొస్తానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి అన్నిరకాలగా శ్రమిస్తానని తనని తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసారు. పాదయాత్రలు..బస్సు యాత్రలు చేసి పార్టీకి ఎంత బలమైనా చేకూర్చుతానని ధీమా వ్యక్తం చేసారు. అయితే ఆయన వ్యాఖ్యలపై ఆయన వ్యతిరేక వర్గం జోకులేసుకుంటోంది. కుదేలైన కాంగ్రెస్ ని ఇంకా కుదేల్ చేస్తావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి 50 మంది ఎమ్మెల్యేలను ఏ నమ్మకంతో తీసుకొస్తావ్? కనీసం ఇక్కడ కాంగ్రెస్ బలమైన పార్టీగా ఉన్న ఆనమ్మకంతోనైనా ఎమ్మెల్యేల జంపిగ్ కు ఆస్కారం ఉండేది. ఇక్కడా ఆ సన్నివేశం కూడా లేకపాయే. ఇలాంటి మాటలు నవ్వుకోవడానికి జోకులుగా బాగుంటాయి. ప్రాక్టీకల్ గా జరగవంటూ ఆయన వ్యతిరేక వర్గం సెటైర్లు వేస్తోంది.