Suriya: సూర్యతో సినిమా చేయను, కథ చెప్పను.. సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్!

Suriya: తమిళ స్టార్ హీరో సూర్య గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు సూర్య. తెలుగు తమిళ భాషల్లో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. తమిళంలో సూర్య నటించిన చాలా సినిమాలు కూడా తెలుగులోకి విడుదల అయ్యాయి. ముఖ్యంగా సూర్య నటించిన సింగం సినిమా సిరీస్ ఇక్కడ కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇక సూర్య రీసెంట్ గా కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసందే.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్‌ లో కనిపించారు. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో సూర్య నటించి ఆకట్టుకున్నాడు. విడుదలకు ముందు ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అవే అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. శివ దర్శకత్వంలో తెరకెక్కిన కంగువ సినిమా ప్రేక్షకులను భారీగా నిరాశపరిచింది. ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఒక డైరెక్టర్ సూర్య గురించి చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు?ఎలాంటి కామెంట్స్ చేశాడు? అన్న విషయానికొస్తే.. దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ..

సూర్యతో సినిమా చేయను అని చెప్పి షాక్ ఇచ్చాడు. అలాగే అతను మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం ఒక పెద్ద సినిమా విడుదలై దారుణంగా ప్లాప్ పాలైంది. అభిమానులు ఈ చిత్రానికి దారుణమైన రివ్యూలు ఇచ్చారు. సినిమా ఫెయిర్‌ గా ఉంటే జర్నలిస్టులు, ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చితే సినిమాను నెత్తిన పెట్టుకుంటారు. మీరు సూర్య కోసం సినిమా చేస్తున్నారా? అనే ప్రశ్నకు మిష్కిన్ మాట్లాడుతూ.. నేను అతనికి కథ చెప్పను. నాకు పిక్చర్ ఇచ్చినా ఒప్పుకోను. ఆయనతో సినిమా చేయను అని మిష్కిన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.