జగన్ సమక్షం లోనే కొడాలి నాని ని టార్గెట్ చేస్తున్నారు ? ఊహించని న్యూస్ !

Social media users angry over Kodali Nani comments

 

నిన్న మొన్నటి వరకు కొడాలి నాని అంటే ఏపీ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా చూసే వారు.. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలతో కొడాలి నాని కూడా చిక్కుల్లో పడుతున్నారని అంటున్నారు కొందరు.. అదీగాక తిరుమలలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి కొడాలి నాని తీరు వైసీపీకి ఇరకాటంగా మారినట్టు కనిపిస్తోందట. అందుకే వైసీపీ ముఖ్యనేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తప్పుబట్టారంటున్నారు.

ఇక ఇప్పటి వరకు కొడాలి నాని చేసిన ఇతర వ్యాఖ్యలపై అంతగా చర్చ జరగకపోయినప్పటికీ.. ఆయన ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా దుమారం రేపాయన్న విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుతం వరకు వైసీపీ తరపున టీడీపీ, చంద్రబాబును, నారా లోకేశ్‌ తీవ్రంగా విమర్శించే వారిలో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. అలాంటి నాని ఒక్క సారిగా యూటర్న్ తీసుకుని కేంద్రంలో వేలుపెట్టాడు.. ఆ వివాదం సమసిపోయిందనుకున్న సమయంలో కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాలు నాని మెడకు చుట్టుకుంటున్నాయి అంటున్నారు విశ్లేషకులు..

దీనికి కారణం మంత్రి కొడాలి నాని చొరవ తీసుకుని వంశీని వైసీపీకి మద్దతిచ్చేలా చేశారు. ఇది నచ్చని స్దానిక వైసీపీ నాయకులు కొడాలి నానిని టార్గెట్ చేశారట. ఇకపోతే 2014, 2019 ఎన్నిక‌ల్లో వంశీ పై వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామ‌చంద్ర‌రావు, యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు వ‌ర్గాలకు వంశీ అంటే ఏ మాత్రం గిట్టడం లేదు. అదీగాక వంశీ స‌న్నిహితుడు అయిన కొడాలి నాని వంశీని వైసీపీ సానుభూతి ప‌రుడిగా మార్చ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హరించిన మాట వాస్త‌వమే గాక, వైఎస్ జగన్ దృష్టిలోకి ఈ రాజకీయ వర్గపోరును నాని తీసుకెళ్లాడట..

దీంతో ఇక్కడి నేతలు నాని విషయంలో కూడా గరం గరంగానే వ్యవహరిస్తున్నారట.. ఇకపోతే ఇది వ‌ర‌కు వంశీ విష‌యంలో దుట్టా మాత్ర‌మే దూకుడుగా ఉండ‌గా.. ఇప్పుడు వెంక‌ట్రావు సైతం ఫైర్ అవుతున్నారు. ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి చివ‌ర‌కు ఇప్పుడు కొడాలి నానిని టార్గెట్ చేస్తున్నారు. కాగా తెరవెనక జరిగే రాజకీయతంత్రాలకు ఎవరో ఒకరు బలికాక తప్పదు మరి ఈ గన్నవరం రాజకీయాలు ఎవరి మెడకు చుట్టుకుంటాయో చివరికి అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు..