కొడాలి నాని నోరు తెరిచారంటే ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. నిజానికి.. ఆయన చాలా ముక్కుసూటి మనిషి. తనకు ఎవరైనా ఎదురొస్తే అంతే. కృష్ణా జిల్లాలో ఎంతో కష్టపడి పైకొచ్చి.. మంత్రి స్థాయికి ఎదిగిన నాయకుల్లో కొడాలి ఒకరు. అందుకే.. ఆయనకు అక్కడ అంత ఫాలోయింగ్.
అయితే.. కొడాలి నాని.. చంద్రబాబుపై అప్పుడప్పుడు పదునైన విమర్శలు చేస్తుంటారు. తాజాగా మరోసారి చంద్రబాబును టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చంద్రబాబు టీడీపీకి పట్టిన శని అంటూ కొడాలి విమర్శించారు.
హైదరాబాద్ ప్రజలు చంద్రబాబును, ఆయన పార్టీని ఏం చేశారో అందరికీ తెలుసు. ప్రస్తుతం ఏలూరు ఘటనపై కావాలని టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఏలూరులో నివారణ చర్యలు తీసుకుంటోంది. అయినా కూడా టీడీపీ శవాలపై పేలాలు ఏరుకుంటోంది. ఇప్పటికైనా టీడీపీ ఏలూరు ఘటనపై రాజకీయం చేయడం మానుకుంటే బెటర్.. అంటూ కొడాలి నాని మండిపడ్డారు.
అలాగే.. నివర్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులను కూడా ఏపీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కావాలని నివర్ తుపాను అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని.. జగన్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని.. రైతుల ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలు చేయడం సరికాదన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. ప్రతిపక్షాలు.. ఇలాంటి విమర్శలు చేయడం వల్ల వాళ్లకు వచ్చేదేం లేదు. చివరకు రైతులను ఆదుకునేది సీఎం జగనే అంటూ కొడాలి స్పష్టం చేశారు.