కొడాలి నాని.. వైసీపీ ఫైర్ బ్రాండ్. ఎవ్వరికీ భయపడరు. ఏపీ సీఎం జగన్ ను మాత్రం ఒక్క మాట అననీయరు. ఎవరైనా వైఎస్ జగన్ ను విమర్శిస్తే అస్సలు ఊరుకోరు. వాళ్ల తాట తీస్తారు. ఆయనన మాట్లాడితే ఎదుటి వాళ్లు మౌనంగా ఉండాల్సిందే. అంతకు మించి ఇంకేం చేయడానికి ఉండదు. ఆయన మాటతీరే కొట్టినట్టుగా ఉంటది. ఆయనది బేస్ వాయిస్. ఆయన వాయిస్ కే భయపడిపోతారు కొందరు.
అయితే..గత కొన్ని రోజుల నుంచి కొడాలి నాని వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆయన దూకుడుతత్వం వల్ల ఇప్పుడు ఆయనకే కాదు.. ఆయన మంత్రి పదవికి, పార్టీకి ఎన్నో సమస్యలు వస్తున్నాయి.
నాని దూకుడుతనం ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కూడా తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. హిందూ దేవాలయాల మీద, వాటి మీద జరుగుతున్న దాడుల మీద నాని ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నాని వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ నేతలు, హిందుత్వవాదులు నానిపై ఫైర్ అవుతున్నారు.
నానిని వెంటనే మంత్రి పదవి నుంచి, పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ పార్టీ కోరుతోంది. కోరడమే కాదు.. ఏపీ బీజేపీ పార్టీ ఒక తీర్మానాన్నే ఆమోదించింది.
మరోవైపు వైసీపీలోనూ హిందూ దేవుళ్ల గురించి నాని చేసిన కామెంట్స్ పై చర్చ జరుగుతోంది. నాని తొందరపడి మాట్లాడాడని.. వైసీపీ సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ విషయం జగన్ కు కూడా తెలియడంతో.. ఏం చేయాలో తెలియక జగన్ ఆలోచనలో పడ్డారని సమాచారం.
అయితే.. బీజేపీ పార్టీ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదలడం లేదు. ఆయన్ను మామూలుగా టార్గెట్ చేయలేదు. నాని అసలు మంత్రి పదవికే పనికిరారు.. అన్నట్టుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు.
అసలు ఆయన శాఖ కాదు.. స్పందించాలని ఎవ్వరూ చెప్పలేదు. అయినా కూడా నాని ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. అంటూ కొందరు వైసీపీ నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారట.
మీడియా ముందు ఎందుకు నాని.. అంతలా రెచ్చిపోయి మాట్లాడటం.. తన దూకుడుతనం తగ్గించుకోకపోతే.. పార్టీకి చెడ్డపేరు రావడం ఖాయం అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారట.
అయితే.. నాని.. వైఎస్ జగన్ కు సన్నిహితుడు. అందులోనూ వైసీపీలో సీనియర్ లీడర్, మంత్రి. దీంతో జగన్ కూడా నానిపై చర్యలు తీసుకోవడానికి కాస్త వెనకడుగు వేస్తున్నారట. ఏది ఏమైనా నాని వ్యాఖ్యలతో హిందుత్వవాదుల మనోబావాలు దెబ్బతిన్నాయని.. నాని ఇలాగే వివాదస్పద వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వాన్ని కోరుతామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.