‎Tollywood: డైరెక్టర్ సింప్లిసిటీ ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. కోట్లు ఉన్నా కూడా సింపుల్ గా అలా!

‎Tollywood: మామూలుగా కొంతమంది డబ్బు ఉంది కదా అని ఖరీదైన బట్టలు, చెప్పులు నగలు కార్లు వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొంతమంది కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఏమీ లేనట్టుగా చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సొంత టాలెంట్ ని నమ్ముకుని పైకి ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనే నియమాన్ని బాగా పాటిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఒక టాలీవుడ్ డైరెక్టర్ ప్రవర్తన కూడా అలాగే ఉంది. వందల కోట్లతో సినిమాలను తెరకెక్కిస్తున్న కూడా సదరు డైరెక్టర్ మాత్రం ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఎప్పుడు సింపుల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు.

బయట ఎక్కడ కనిపించినా కూడా చిన్నచిన్న కార్లలో ప్రయాణించడం, అలాగే సింపుల్ గా ఉండే దుస్తులు ధరించడం, ఇవన్నీ కూడా అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరా అని అనుకుంటున్నారా, ఆయన మరెవరో కాదండోయ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్. తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వకముందు స్క్రీన్ రైటర్ గా, అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాలకు సహయ దర్శకుడిగా కూడా పనిచేశారు నాగ్ అశ్విన్. తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ ఆ తర్వాత మహానటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.

ఈ సినిమాతో ఇండస్ట్రీలో నాగ్ అశ్విన్ పేరు మారుమోగింది. ఇక ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఇప్పుడు కల్కి 2 ప్రాజెక్ట్ పై మరింత హైప్ నెలకొంది. అయితే రూ.600 కోట్లతో సినిమా తెరకెక్కించి కోట్లలో కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ చిన్న కారులో ప్రయాణిస్తూ కనిపించాడు. ఆ కారు ధర కేవలం పది లక్షలు అని సమచారం. దీంతో నాగ్ అశ్విన్ సింపుల్ లైఫ్ స్టైల్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. గతంలో కూడా చాలా సార్లు చాలా సింపుల్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కోట్లలో డబ్బు ఉన్న కూడా ఇలా సింపుల్ గా కనిపించడం అన్నది చాలా అరుదు. నిజంగా నాగ్ అశ్విన్ గారు చాలా గ్రేట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.