Tollywood: దృశ్యం సినిమాలో మీనా పాత్రను రిజెక్ట్ చేసిన హీరోయిన్.. ఎవరో తెలుసా?

Tollywood: టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ సీనియర్ హీరోయిన్ మీనా జంటగా నటించిన చిత్రం దృశ్యం. అయితే వీరిద్దరి కాంబోలో గతంలో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ జంటకు అభిమానుల్లో కూడా బాగా క్రేజ్ ఉంది. ఇకపోతే వీరిద్దరూ కలిసి నటించిన దృశ్యం సినిమా తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. కూతురి భవిష్యత్తు.. కుటుంబం కోసం ఒక తండ్రి పడే తపన, పోరాటమే ఈ చిత్రం. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా మలయాళం మూవీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. అయితే మలయాళంలో హీరోగా మోహన్ లాల్ నటించగా.. అక్కడ సైతం మోహన్ లాల్ సతీమణిగా మీనా నటించింది. అయితే ఈ పాత్రకు ముందుగా అనుకున్న నటి మీనా కాదట. అవును మీనా పాత్రకు ముందుగా సీనియర్ నటి శోభనను అనుకున్నారట. అయితే ఆ సినిమాను ఆమె తిరస్కరించిందట. అందుకు గల కారణాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది శోభన.

ఆ సమయంలో తాను వినీత్ శ్రీనివాసన్ సినిమాలో నటిస్తున్నానని అందుకే దృశ్యం సినిమాను రిజెక్ట్ చేసినట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దృశ్యం సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను చూస్తున్నంత సేపు ఏం జరుగుతుంది అన్న సస్పెన్స్ ప్రేక్షకులలో ఉంటుంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది.