Parawheel: పారావీల్ వెబ్ సైట్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించిన కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్.. ప్రజల ముందుకు వచ్చేది అప్పుడే!

Parawheel: ఏపీలో 2024లో జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ అఖండ మెజార్టీని గెలవక ముందే తప్పకుండా గెలుస్తుంది అని ఆక్యురేట్ గా పర్పెక్ట్ సర్వే ఇచ్చింది కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ. కాగా ఇప్పుడు ఈ సంస్థ పారావీల్ అనే యాప్ ను తయారు చేసింది. భారతదేశపు తొలి రియల్ టైమ్ పబ్లిక్ ఇంటెలిజెన్స్ యాప్ గా పారావీల్ ను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రజల ముందుకు తీసుకు రాబోతోంది కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ. తాజాగా పారావీల్ యాప్ కర్టెన్ రైజర్ ఈవెంట్ హైదరాబాద్ వెస్టిన్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి సుమారు కనకాల యాంకర్ గా వ్యవహరించారు.

ఈ యాప్ ని కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అధినేత కిరణ్ కొండేటి లాంఛ్ చేశారు. అయితే ఈ సందర్భంగా ఈవెంట్ లో భాగంగా కిరణ్ కొండేటి మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీ మా సంస్థకు ప్రత్యేకమైన రోజు. గత ఏడాది ఇదే రోజున ఏపీ ప్రజలు మా కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ గురించి మాట్లాడుకున్నారు. కూటమి గెలుస్తుందని మేము ఇచ్చిన సర్వే ఆక్యూరేట్ గా నిజమైంది. ప్రజల నాడిని మా సర్వే ద్వారా వెల్లడించాము. అంతేగానీ మేము ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చేయడం లేదు వ్యతిరేకించడం లేదు. ఇప్పుడు మా సంస్థ నుంచి పారావీల్ వెబ్ సైట్, యాప్ లాంఛ్ చేయడం అన్నది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది భారతదేశపు ఫస్ట్ రియల్ టైమ్ పబ్లిక్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్. మొదట దీనిని ఆంధ్రప్రదేశ్ లోనే ప్రారంభిస్తున్నాము. ఈ నెల 12 నుంచి మా వెబ్ సైట్, యాప్ అందుబాటులోకి వస్తుంది.

క్రమంగా ఇతర రాష్ట్రాల్లో కూడా మా ప్లాట్ ఫామ్స్ ప్రారంభిస్తాము. రాజకీయాల్లో ఉన్న వారికి రాజకీయాల్లోకి రావాలనుకునేవారికి నియోజకవర్గంలో ఉన్న సమస్యలేంటి అనేది తెలుసుకునేందుకు మా పారావీల్ వెబ్ సైట్, యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఒక్కో నియోజకవర్గంపై 36 అంశాలతో 100 పేజీలకు తగ్గకుండా సమగ్ర సమాచారాన్ని పొందుపరిచాము. ఇందులో విద్యా, వైద్యం, మేల్, ఫీమేల్, కులాల మధ్య సమస్యలు లాంటి తదితర అంశాలు ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గంలో ఉండే జనాభాతో పాటు, మండలాలు, గ్రామాలు, బూత్ స్థాయి లో ప్రతి అంశాన్ని ప్రస్తావించడంతో పాటు అక్కడ ఉన్న సమస్యలను సైతం అప్లికేషన్ లో తెలుసుకోవచ్చు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు వారికి ఏం సమస్యలు ఉన్నాయి అనే సమాచారం కూడా ఉంటుంది. ప్రస్తుతం మేము తీసుకున్న డాటా ప్రకారం 19 ఎమ్మెల్యేలపై 30 శాతం వ్యతిరేకత ఏర్పడింది. కూటమి నేత ఎవరు కావాలని కూటమి సపోర్టర్స్ ను అడిగితే ఆశ్చర్యపరిచేలా 7శాతం మంది ఎన్టీఆర్ పేరు చెప్పారు. అలాగే కూటమి నేత ఎవరు కావాలని వైసీపీ సపోర్టర్స్ ను అడిగితే ఎన్టీఆర్ కావాలంటూ 21శాతం మంది చెప్పారు అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.