ప్రముఖ గాయకుడు కేకే అకాల మరణం సంగీత ప్రేమికులను దుఃఖసాగరంలోకి నెట్టింది. ఈ క్రమంలోనే ఆయన పార్థివ దేహాన్ని కోల్‌కతా నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబైకి తీసుకొచ్చారు.ముంబై విమానాశ్రయం నుంచి అతని మృతదేహంతో అంబులెన్స్ అంధేరీ వెర్సోవాలోని వెర్సోవాలోని ఇంటికి చేరుకుంది. కేకే వెర్సోవాలోని ‘పార్క్ ప్లాజా’ కాంప్లెక్స్‌లో అతని మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఉంచారు. ఈ క్రమంలోనే కొన్ని గంటల సమయం పాటు ఆయన పార్థివ దేహాన్ని అక్కడ గురించి అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈయన అంతిమయాత్రకు పెద్ద ఎత్తున పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కేకే పార్థివ దేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం
ఆస్పత్రి నుంచి కోల్‌కతాలోని ప్రముఖ రవీంద్ర సదన్‌కు తరలించారు.అక్కడ కోల్‌కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశంలోని ఈ ప్రసిద్ధ గాయకుడికి గన్ సెల్యూట్ చేశారు. మమత బెనర్జీ ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో గౌరవం చేసిన అనంతరం ఆయన పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో ముంబై తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే నేడు ఈయన అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈయన కోల్ కత్తాలో ఒక కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని తన అద్భుతమైన గాత్రంతో పాటలు పాడి అందరిని సందడి చేశారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. ఇలా ఈయన ఆకస్మిక మరణం సినీ ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈయన తన అద్భుతమైన గాత్రంతో కొన్ని వందల పాటలు పాడి మంచి గుర్తింపు పొందారు.