సుడిగాలి సుధీర్ ను జబర్దస్త్ లో ఘోరంగా అవమానించారా.. ఏం జరిగిందంటే?

బుల్లితెరపై స్టార్ స్టేటస్ ను అందుకున్న కమెడియన్లలో సుడిగాలి సుధీర్ ఒకరు. అయితే ఈటీవీ ఛానల్ లోని ప్రోగ్రామ్స్ కు సుడిగాలి సుధీర్ దూరమయ్యాడు. కిర్రాక్ ఆర్పీ ఒక ఇంటర్వ్యూలో స్టార్ మా ఛానల్ లో ఇప్పుడు నాకు ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ దక్కుతోందని చెప్పుకొచ్చారు. ధనరాజ్ అన్న, వేణు అన్న ఒక షో కోసం బయటకు వెళ్లారని మళ్లీ రావాలని ప్రయత్నాలు చేసినా జబర్దస్త్ వాళ్లు ఛాన్స్ ఇవ్వలేదని ఆర్పీ తెలిపారు.

మాపై నుంచి జబర్దస్త్ సంస్థ నిర్వాహకులు వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఆర్పీ చెప్పుకొచ్చారు. మమ్మల్ని జబర్దస్త్ లో బానిసలలా చూశారని ఆయన తెలిపారు. ప్రాణాలు పోయినా పది పైసలు మిగుల్చుకోవాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆర్పీ చెప్పుకొచ్చారు. సుధీర్ రష్మీ షోను అభివృద్ధి చేయాలని అనుకుంటారే తప్ప వాళ్లు క్యారెక్టర్ లెస్ అనుకోవడం తప్పని ఆర్పీ తెలిపారు.

సుధీర్, అది లేకపోతే జబర్దస్త్ ప్రోగ్రామ్ లేదని ఆర్పీ అన్నారు. ప్రతిభకు తగ్గ పారితోషికం తీసుకోవడంలో తప్పు లేదని ఆర్పీ పేర్కొన్నారు. సుధీర్ ను అవమానించి బయటకు పంపించారని ఆర్పీ చెప్పుకొచ్చారు. ఒక జబర్దస్త్ టీమ్ లీడర్ అన్న చనిపోయాడని చాలా ఎక్కువగా తాగుతున్నాడని అతనిని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లానని ఆర్పీ కామెంట్లు చేశారు. ఆ సమస్యకు సొల్యూషన్ ఏంటని నేను ఆలోచించానని ఆర్పీ చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో నాగబాబు గారికి ఫోన్ చేశానని నాగబాబు గారు వీడియో కాల్ చేసి ఆ వ్యక్తికి సూచనలు చేశారని ఆర్పీ చెప్పుకొచ్చారు. తాగేసి ఏడవటం అంటే ఎంజాయ్ చేయడమేనని నాగబాబు అతనికి చెప్పారని ఆర్పీ కామెంట్లు చేశారు. ఈరోజు ఆ కమెడియన్ సంతోషంగా ఉన్నాడని ఆర్పీ తెలిపారు. మాకు ఏ కష్టం వచ్చినా నాగబాబు సహాయం చేశారని ఆర్పీ చెప్పుకొచ్చారు. జబర్దస్త్ ప్రొడ్యూసర్ నిర్మాతలానే వ్యవహరించారని ఆర్పీ తెలిపారు.