Junior Movie Review: జూనియర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. గాలి కొడుకు ఫస్ట్ సినిమా హిట్టా?ఫట్టా?

Junior Movie Review: ప్రముఖ రాజకీయ నాయకులు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటిరెడ్డి హీరోగా పరిచయమవుతు నటించిన చిత్రం “జూనియర్”. ఎన్నో అంచనాలు నడుమ నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఎస్ఎస్ రాజమౌళి, శివరాజ్ కుమార్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. వైరల్ వయ్యారి అనే పాట విడుదల చేసినప్పటి నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా కథ ఏంటి? మొదటి సినిమాతోనే గాలికిరీటి రెడ్డి హిట్ కొట్టడా? అనే విషయాలు తెలుసుకుందాం…

కథ: విజయనగరం గ్రామానికి చెందిన కోదండపాణి అలియాస్ వీ రవిచంద్రన్ గర్భవతైన భార్యతో పాటు ఊరు విడిచి వెళతాడు. బస్సులోనే భార్య ప్రసవించి మృతి చెందడంతో, ఆ బిడ్డను కోదండపాణి ఒక్కడే పెంచుకుంటాడు. ఆ పిల్లవాడే అభి అలియాస్ కిరీటి రెడ్డి. చిన్నప్పుడు తల్లి కోల్పోవడంతో తండ్రి ఒత్తిడి ప్రేమతో పెరిగిన ఆఫీస్ తనకంటూ స్వేచ్ఛ కావాలని సిటీకి వెళ్లి అక్కడ కాలేజీలో చేరుతారు అయితే కాలేజీలో చేరిన తర్వాత అభికి స్ఫూర్తి అలియాస్ శ్రీ లీల పరిచయమవుతుంది. మొదటి చూపులోనే స్ఫూర్తితో ప్రేమలో పడిన అభి చివరికి ఆమె పనిచేసే కంపెనీలోనే ఉద్యోగంలో చేరుతాడు.అక్కడే సీఈఓగా ఉండే విజయ సౌజన్య అలియాస్ జెనీలియాకి అభి అంటే మొదటి నుంచి నచ్చదు. కానీ ఒక సందర్భంలో ఇద్దరూ కలిసి విజయనగరానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఊరితో విజయకి ఉన్న అనుబంధం ఏమిటి? అభి, విజయ మధ్య ఉన్న లింక్ ఏంటి? అనేవి తెలియాలంటే ఈ సినిమా కథ చూడాల్సిందే.

ఈ తరహా కథలు ఇది వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎండ వచ్చినప్పటికీ ఆ కథను ఏ విధంగా ప్రేక్షకులకు చూపించామన్నది దర్శకుడి ప్రతిభ పై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు రాధాకృష్ణారెడ్డి మంచి సక్సెస్ అయ్యారని చెప్పాలి. ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ సినిమాని అద్భుతంగా చూపించారు .మొదటి భాగం కిరీటిరెడ్డి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ డాన్సులు అదరగొట్టారు.వైరల్ అయిన ‘వయ్యారి పాట’ మొదలుకుని, ఫన్నీ గ్యాంగ్ ఎంట్రీలు, లవ్ ట్రాక్‌లు ఫస్ట్ హాఫ్‌కి బలమవ్వగా… జెనీలియా పాత్ర ఎంట్రీతో కథ మొత్తం కీలక మలుపు తిరుగుతుంది.

ఇక సెకండ్ హౌస్ మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎమోషన్స్‌కి ప్రాధాన్యం ఇస్తూ సినిమాలో మంచి ఎమోషన్స్ చూపించాడు. మరీ ముఖ్యంగా హీరో-తండ్రి మధ్య ఉన్న బంధం, ఎమోషనల్ ట్విస్టులు సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కిరీటి రెడ్డికి ఇది డెబ్యూ సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న నటుడిగా నటించారు. ఈయన నటన నుంచి మొదలుకొని డైలాగ్ డెలివరీతో పాటు అద్భుతమైన డాన్సులు యాక్షన్ సన్ని వేషాలలో కూడా అదరగొట్టారని చెప్పాలి.

శ్రీ లీల విషయానికి వస్తే ఈ సినిమాలో శ్రీ లీల పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో ఆమె కూడా అద్భుతంగా నటించారు. ఇక సెకండ్ హాఫ్ లో శ్రీల పూర్తిగా మాయమవుతుంది. ఇక జెనీలియా పాత్ర ఈ సినిమాకు అద్భుతంగా ఉందని చెప్పాలి. 13 ఏళ్ల తర్వాత ఈమె రీ ఎంట్రీ ఇచ్చిన మంచి పాత్రతో రీ ఎంట్రీ ఇచ్చారని చెప్పాలి. ఇతర నటీనటుల నటన కూడా అద్భుతంగా ఉంది వారి పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీప్రసాద్ తన మార్కు చూపించారు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎమోషనల్ సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయి. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతం. ప్రతి ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా, గ్రాండ్‌గా కనిపించింది. టెక్నికల్ వర్క్ కూడా సినిమాకు ఎంతో ప్లస్ పాయింట్ అయింది.

రేటింగ్:3.25/5