Kiran abbavaram: సినిమాలలోకి రాకపోతే రాజకీయాలలోకి వెళ్ళేవాన్ని… రాజకీయాలంటే చాలా ఇష్టం: కిరణ్ అబ్బవరం

Kiran abbavaram: ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల క అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఎంతో మంచి హిట్ అందుకున్నారు త్వరలోనే దిల్ రూబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా మార్చి 14వ తేదీ హోలీ పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పేకవంతం చేశారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు ఇతర అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలనే పెంచేసాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం తన కెరీర్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

జీవితంలో ఏదో ఒకటి పెద్దగా సాధించాలనే కోరిక బలంగా ఉండేది నాకు. అందులో భాగంగానే హీరో కావాలనుకున్నాను. కానీ నాకు రాజకీయాలు అంటే కూడా చాలా ఆసక్తి అని తెలిపారు ఒకవేళ సినిమాలలోకి రాకపోయి ఉంటే కచ్చితంగా రాజకీయాలలోకి వెళ్లే వాడినని తెలిపారు. తాను రాయలసీమకు చెందిన అబ్బాయి కావడంతో చిన్నప్పటినుంచి రాజకీయాలను చాలా దగ్గరగా చూస్తూ పెరిగానని తెలిపారు.

ఇలా సినిమాలు సెట్ కాకపోయి ఉంటే రాజకీయాలలోకి వెళ్లేవాడినీ. మంచి, చెడు పక్కన పెట్టి ప్రజలతో మమేకం అవ్వడం గొప్ప విషయం. అది నాకు నచ్చుతుంది.. అందుకే నాకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువనీ తెలిపారు. ఇక ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా చెబుతూ తాను త్వరలోనే రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నానని రాయలసీమ ఆహార పదార్థాలను రాయలసీమ రుచులను ఇక్కడ వారికి పరిచయం చేయాలన్నదే తన కోరిక అని అందుకే త్వరలోనే రెస్టారెంట్ కూడా ప్రారంభించబోతున్నానని కిరణ్ అబ్బవరం తెలిపారు.