Kirak RP: నీ పిల్లలకు అవే మాటలు బోధిస్తావా …. యాంకర్ శ్యామలకు మాస్ కౌంటర్ ఇచ్చిన ఆర్పీ!

Kirak RP: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు రాజకీయాలలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వైకాపాలో కాస్త సినీ సెలబ్రిటీలు ఎక్కువగా ఉండేవారు కానీ ఈ ఎన్నికలలో వైకాపా ఓడిపోవడంతో ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామా చేస్తూ వెళ్లిపోతున్నారు. ఇక గత ఎన్నికలలో వైసిపి తరఫున పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం వారిలో యాంకర్ శ్యామల కూడా ఒకరు అయితే ఇప్పుడు శ్యామల వైసీపీలో కీలక బాధ్యతలను తీసుకున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడంతో శ్యామల స్పందిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కూటమి ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో తప్పుపడుతూ వచ్చారు.. ఇక పోసాని గతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ కారణంతోనే ఆయనపై కేసు నమోదు కావడం పోలీసులు అరెస్టు చేయడం జరిగింది కానీ పోసాని అరెస్టును మాత్రం శ్యామల పూర్తిస్థాయిలో తప్పుపడుతూ ఆయనకు అండగా నిలిచారు.

ఈ క్రమంలోనే పోసాని అరెస్టును ఖండించిన శ్యామల గురించి కిరాక్ ఆర్పీ స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ పోసాని కృష్ణ మురళి, కొడాలి నాని, ఆర్కే రోజా వంటి వారు చేసే వ్యాఖ్యలు నీతి వాక్యాలు అయితే ఇలాంటి వ్యాఖ్యలను ప్రతిరోజు ఉదయాన్నే నీ పిల్లలకు బోధించు అంటూ ఈయన మాట్లాడారు. వారు ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో అర్థమవుతుందా ఇలాంటి మాటలు మాట్లాడే వారికి మద్దతు తెలపడం ఏంటి.

ఇక ఇది నీతి వాక్యాలు లాగా నీకు అనిపిస్తే ప్రతిరోజు ఉదయం నీ బిడ్డలకు నేర్పించుకో అంటూ మాట్లాడారు. అలాగే ఈ వివాదంలోకి గోరంట్ల మాధవ్ వ్యవహార శైలిని కూడా ప్రస్తావిస్తూ యాంకర్ శ్యామలకు ఆర్పీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.