ఒకప్పుడు కేంద్ర మంత్రిగా ఒక వెలుగు వెలిగిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి యొక్క రాజకీయ జీవితం ఇప్పుడు అగమ్యగోచరంగా మారిపోయింది. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలపై కిల్లి కృపారాణి కక్ష సాధింపు ధోరణి సాగించి, వాళ్ళను ఎదగనీయకుండా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవనే విషయాన్నీ నిజం చేస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవ్వటమే కాకుండా, ఏకంగా రాష్ట్రంలో దుకాణం ఎత్తేసే పరిస్థితికి వచ్చింది. వైసీపీ పార్టీ ఘన విజయం సాధించి, జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు.
దీనితో ఇక కాంగ్రెస్ పార్టీలో ఉంటే లాభం లేదనుకొని వైసీపీ లోకి రావటానికి ట్రై చేసింది. అయితే స్థానిక వైసీపీ నేతలు వ్యతిరేకించడంతో ఆమె రాకకు కొన్ని రోజులు బ్రేక్ పడింది. ఎలాగోలా 2019 ఎన్నికల ముందు వైసీపీ లోకి చేరింది. అయితే ఆ ఎన్నికల్లో జగన్ ఆమెకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎలాగూ వైసీపీ ప్రభుత్వం రాబోతుందని., ఆ తర్వాత ఏమైనా నామినేటెడ్ పోస్ట్ లు ఇస్తానని చెప్పినట్లు సమాచారం. టెక్కలి అసెంబ్లీ, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో కిల్లి కృపారాణికి పట్టుంది. కానీ ఆ రెండు చోట్లు వైసీపీ ఓడిపోవటంతో దానిని సాకుగా చూపించి జగన్ ఆమెను పట్టించుకోవటం మానేశాడు.
ఇక జిల్లాలో వైసీపీ నేతలతో కూడా ఆమెకు సరైన సంబంధాలు లేవని, ధర్మాన కుటుంబంతో కిల్లికి మొదటి నుండి విభేదాలు వున్నాయి. దీనితో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఆమెను దూరం పెట్టాడు. ఇక స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సిదిరి అప్పల్రాజు తో కిల్లి కృపారాణికి సరిగ్గా మాటలు కూడా లేవని సమాచారం. దీనితో శ్రీకాకుళంలో ఆమె ఒంటరి అయ్యింది. ఎమ్మెల్యే లు కానీ , మంత్రులు కానీ ఎవరు ఆమెని పట్టించుకోకపోవటంతో చాలా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగని ఇప్పటికిప్పుడు పార్టీ మారితే వచ్చే లాభం కూడా ఏమి లేదు. టీడీపీ పరిస్థితి బాగాలేదు, బీజేపీ పై నమ్మకం లేకపోవటంతో ఆమె మౌనంగానే వైసీపీ లో కొనసాగుతుంది., మరో మూడేళ్లు అధికారం వుంది కాబట్టి, ఏమైనా పదవులు రాకపోతాయా అనే ఆశతో వైసీపీ లో కొనసాగుతుంది మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి