Crime News: తోటి ఉపాధ్యాయురాలి పై కన్నేసిన ఉపాధ్యాయుడు..మాయమాటలతో కారులో ఎక్కించుకొని దారుణం..!

Crime News: తల్లిదండ్రులు, గురువు దైవం తో సమానం అని అంటుంటారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే..గురువులు ఆ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి విద్యార్థులు సన్మార్గంలో వెళ్ళేలా చూస్తారు.కానీ ప్రస్తుత కాలంలో అలాంటి గురువులే విద్యార్థుల పట్ల తోటి ఉపాధ్యాయుల పట్ల దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో విద్యార్థినులపై ఉపాధ్యాయులు చేసే అరాచకాలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల తోటి ఉపాధ్యాయురాలు మీద ఉపాధ్యాయుడు దారుణానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. మహాబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బానోత్‌ కిషోర్‌ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఖమ్మం లో నివాసం ఉంటున్నాడు. బానోత్ కిషోర్ భార్య కూడా ఉపాధ్యాయురాలు.ఈమె డోర్నకల్‌ సమీపంలోనే ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. భార్య భర్తలు ఇద్దరూ కలిసి ప్రతిరోజూ కారులో పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. డోర్నకల్‌ మండలంలో టీచర్‌గా పని చేస్తున్న మరో ఉపాధ్యాయురాలు కూడా ఖమ్మంలోనే నివాసం ఉంటోంది. ఈమె ప్రతిరోజు డోర్నకల్‌ వరకు రైలులో వెళ్లి అక్కడ్నుంచి తన ద్విచక్రవాహనంపై పాఠశాలకు హాజరవుతుంటుంది.

ఈ క్రమంలో సదరు ఉపాధ్యాయురాలు మీద కన్నేసిన భానోత్ కిషోర్ సరైన సమయం కోసం వేచి చూసాడు. ఈ తరుణంలో పాఠశాలలకు ఒంటి పూట బడి ప్రారంభం కావడంతో సదరు ఉపాధ్యాయురాలు మధ్యాహ్నం పాఠశాల ముగిసిన తర్వాత రైల్వే స్టేషన్ కి అక్కడినుండి రైలు లో ఇంటికి వెళ్ళేది. ఒక రోజు తన భార్య పాఠశాలకు రాకపోవడంతో ఎలాగైనా సదరు టీచర్ నీ అనుభవించాలని కిషోర్ నిర్ణయించుకొని ఆమెకు మాయ మాటలు చెప్పి తన భార్య కూడా కార్ లో మనతో పాటు వస్తుందని నమ్మించి ఆమెను కార్లో ఎక్కించుకున్నాడు.

ఉపాధ్యాయురాలిని దారి మళ్లించి పాండురంగాపురంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి ఆమె ఫోన్ తీసుకొనీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే భర్త పిల్లల్ని చంపేస్తానని ఆమెను బెదిరించాడు. బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన విషయం ఆమె భర్తకు చెప్పటంతో ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి కిషోర్ అనే ఉపాధ్యాయుడు మీద పోలీసులకు పిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.