ప్రశాంత్ నీల్, యష్ కాంబినేషన్లో వచ్చిన ‘కెజిఎఫ్’ చిత్రం అంత భారీ విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం హీరో ఎలివేషన్స్. హీరో ఎలివేషన్స్ అంటే ఫైట్స్. సినిమాలోని భారీ పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని గొప్పగా ఆకట్టుకున్నాయి. అందుకే అన్ని భాషల్లోనూ సినిమా మంచి ఆదరణ పొందింది. ఈ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేసింది స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు, ఆరివ్. ఇప్పుడు వీళ్ళే కమల్ హాసన్ కొత్త సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేయనున్నారు. కమల్ హాసన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ సినిమాను చేస్తున్నారు. సినిమా నుండి విడుదలైన టీజర్ చూశాక అందులో విపరీతమైన యాక్షన్ కంటెంట్ ఉంటుందని స్పష్టంగా తెలిసింది.
సినిమాను వేరే లెవల్లో ఉంచడానికి లోకేష్ కనగరాజ్ ఆరివ్, అన్బులను తీసుకొచ్చారు. ‘కెజిఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు స్టంట్ మాస్టర్స్ ‘సలార్’ లాంటి భారీ చిత్రాలకి వర్క్ చేస్తున్నారు. కమల్ హాసన్ లాంటి గొప్ప నటుడి సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసే అవకాశం రావడంతో వారిద్దరూ కూడ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. చూడబోతే లోకేష్ కనగరాజ్ సినిమాను చాలా పెద్ద స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇక శంకర్, లైకా నిర్మాతల మధ్యన నడుస్తున్న ‘ఇండియన్ 2’ వివాదం ఒక కొలిక్కి వస్తే ‘విక్రమ్’ సినిమా షూటింగ్ ఎప్పుడు మెదలయ్యేది ఒక క్లారిటీ వస్తుంది.