వైష్ణవ్ తేజ్ సరసన హాట్ భామ

Vaishnav Tej

Kethika Sharma to romance with Vaishnav Tej

మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’తో గ్రాండ్ హిట్ అందుకున్నాడు. ఏకంగా 70 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ విజయంతో అతనికి భారీ డిమాండ్ ఏర్పడింది. కొత్త, పాత అనే తేడా లేకుండా అతని కోసం దర్శకులు ఎగబడుతున్నారు. ఇప్పటికే వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేశాడు. అదే అతని రెండవ సినిమా. ప్రస్తుతం అతని చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. అన్నీ పెద్ద నిర్మాతల సినిమాలే కావడం విశేషం. వాటిలో ఒకటి నాగార్జున నిర్మాణంలో ఉండనుండగా ఇంకొకటి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఉంటుంది.

ప్రసాద్ నిర్మించే సినిమాను తమిళ దర్శకుడు గిరీశాయ డైరెక్ట్ చేయనున్నాడు. ఇతను ‘అర్జున్ రెడ్డి ‘ తమిళ రీమేక్ చేశారు. ఈ సినిమా కోలీవుడ్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇతను వైష్ణవ్ తేజ్ కు ఒక కథ చెప్పారని, అది అతనికి బాగా నచ్చిందని తెలుస్తోంది. ఇందులో కేతిక శర్మను కథానాయకిగా తీసుకోనున్నారట. కేతిక శర్మ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరితో ‘రొమాంటిక్’ సినిమా చేస్తోంది. పోస్టర్లు, ఫస్ట్ లుక్ ద్వారానే తన హాట్ లుక్స్ తో కుర్రకారును కట్టిపడేసింది. ఈమె మీద యువతలో చాలా అంచనాలే ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ సినిమాలో ఈమెనే కథానాయకిగా తీసుకోవడంతో క్రేజ్ మరింత పెరిగింది.