YS Jagan: వైకాపా నాయకుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ధర్మవరం ఎమ్మెల్యేగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన గత ఎన్నికలలో కేవలం 5000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇలా కేతిరెడ్డి తన ఓటమిని ఏమాత్రం అంగీకరించలేకపోయారని చెప్పాలి నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల అవసరాలను తెలుసుకుంటూ అక్కడికక్కడే ప్రజా సమస్యలను పరిష్కరించి నాయకుడిగా గుర్తింపు పొందారు.
ఇలా కేతిరెడ్డి గెలవడం అందరూ ఖాయమని అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈయన కూడా ఓటమిపాలు కావడంతో ఆయన మాత్రం ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. ఇకపోతే ఓటమి తర్వాత కేతిరెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన పార్టీ గురించి అదే విధంగా కూటమి ప్రభుత్వం గురించి కూడా స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి తాజాగా వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారని అందుకే ఓటమి తప్పలేదు అంటూ చెప్పుకోవచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశారు. అయితే ఆయన చేసిన మంచిని చెప్పుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారని, చంద్రబాబు నాయుడు సక్సెస్ కూడా అదే అంటూ తెలియచేశారు.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చారు అలాగే ఎంతో అభివృద్ధి చేశారు కానీ ఆ అభివృద్ధిని ప్రచారం చేసుకోలేకపోయారు. అదే చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన చెప్పే మాటలన్నీ అబద్దమే అయినప్పటికీ కూడా ఒకటికి నాలుగు సార్లు ప్రచారం చేస్తూ అదే నిజమని ప్రజలను నమ్మించగల సమర్థుడని తెలిపారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిపై దృష్టి సారించలేదంటూ అబద్ధాలు చెప్పి నమ్మించారని ఇలా అబద్ధాలతోనే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు అంటూ కేతిరెడ్డి తెలిపారు.