Kejriwal Vs KCR : కేసీయార్ వర్సెస్ కేజ్రీవాల్: కలిసి పని చేస్తారా.? కలబడ్తారా.?

Kejriwal Vs KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ, సొంత రాష్ట్రం తెలంగాణలో కేసీయార్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని ఎలా ఫేస్ చేస్తారన్నదానిపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ విశ్లేషకుల నుంచి.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిలకు ముందు పరిస్థితులూ, ఇప్పుడు పరిస్థితులూ చాలా భిన్నంగా వున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం, పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించడంతో కేసీయార్ పొలిటికల్ సీన్ జాతీయ స్థాయిలో అయోమయంలో పడింది.

వాస్తవానికి ఆ ఎన్నికలతో ప్రత్యక్షంగా కేసీయార్‌కి ఏమీ సంబందం లేదు. కానీ, వాటి ఫలితాలతో కేసీయార్, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేకుండా పోయాయి. దేశంలో బీజేపీ బలంగానే వుందనీ, అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారుతోందన్న చర్చ ఐదు రాష్ట్రాల ఎన్నికలతో షురూ అయ్యింది.

ఈ నేపథ్యంలో కేసీయార్ కంటే కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో బలమైన నాయకుడన్న భావన అందరిలోనూ కలుగుతోంది. ఇదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తన ఆమ్ ఆద్మీ పార్టీని తెలంగాణలోనూ విస్తరించాలనుకుంటున్నారు. ఏప్రిల్ 14న ఆయన హైద్రాబాద్ రానున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అన్ని జిల్లాల్లోనూ, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ పాదయాత్రలు చేయబోతోందట.
అంటే, కేసీయార్ వర్సెస్ కేజ్రీవాల్.. రాజకీయ పోరాటం జరగబోతోందన్నమాట తెలంగాణ గడ్డమీద.!