తండ్రి నిర్మిస్తున్న సినిమాలో కీర్తిసురేష్.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్న నటి

అందం.. అభినయం,, అదృష్టం.. ఇవన్నీ కీర్తి సురేష్ సొంతం. ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ మహానటి. అయితే ఇప్పుడు తన జీవితంలో అనుకున్న మరో ముఖ్యమైన, సంతోషకరమైన సంఘటన చోటు చేసుకుందని అంటోంది ఈ బ్యూటీ. తన తండ్రి సొంత ప్రొడక్షన్ లో నటించబోతున్నట్లు ప్రకటించింది. ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట్లో సందడి చేస్తుంది. తన ఆనందానికి అవుదులు లేవంటూ.. సంతోషంతో పొంగిపోతుంది. ఒక కూతురిగా ఇంతకంటే ఏం కావాలంటూ సంబరపడుతోంది. అసలు వివరాల్లోకి వెళ్తే..


తన సినీ కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేసానని అంటుంది కీర్తి సురేష్. కాకపోతే తన తండ్రి ప్రొడక్షన్ లో రాబోతున్న ఈ సినిమా మాత్రం తనకు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుందని అంటుంది. కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ నిర్మిస్తున్న సినిమాకి వాషి అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాలో టోవినో థామస్ హీరోగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మలయాళంలో తెరకెక్కుతుంది. దీంతో తన ఏడేళ్ళ కల.. ఇప్పుడు నిజమవుతుందని.. ఈ సినిమా తనకు హార్ట్ టచింగ్ ఉంటుందని తన సోషల్ మీడియాలో అకౌంట్ లో తెలియజేసింది. ఒక కూతురిగా ఇంతకు మించిన అచీవ్ మెంట్ లభించదని ఎమోషనల్ అవుతుంది. ఇలాంటి పరిస్థితి అంత తేలికగా రాలేదని.. తన టాలెంట్ ని ప్రదర్శించడానికి తాను ఎంతో కష్టపడ్డానని అన్నారు. వాషి సినిమాతో తనకు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ.. బిజీగా ఉన్నారు. దీంతో పాటు నితిన్ కు జోడిగా రంగ్ దే సినిమాలో.. అలాగే గుడ్ లక్ సఖి సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని కథల్ని వింటూ.. స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.