Keerthy Suresh: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో నిలదుకుకోవాలి అన్నా అలాగే రాణించాలి అన్నా కూడా అందం అభినయం టాలెంట్ తో పాటుగా అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు రాణించవచ్చు. అయితే ప్రస్తుతం సెలబ్రిటీలుగా రాణిస్తున్న చాలామంది ఒకానొక సమయంలో ఎన్నో కష్టాలను మాటలను అవమానాలను ఎదుర్కొన్న వారే. ఎదుర్కొని మాటలను దిగమింగుకొని కష్టపడి సెలబ్రిటీలుగా ఎదిగి నేడు స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్నారు. అలా సెలబ్రిటీలు ఏదో ఒక సినిమా రూపంలో విమర్శల పాలవుతూ ఉంటారు. అలా టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తిట్లు తిందట.
డైరెక్టర్ తనను తిట్టడంతో ఏడ్చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కీర్తి సురేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుగుంటూ దూసుకుపోతున్నారు కీర్తి సురేష్. ఇది ఇలా ఉంటే కీర్తి నటించిన లేటెస్ట్ మూవీ ఉప్పుకప్పురంబు.
సుహాస్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో జులై 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో కీర్తి సురేష్ అలాగే మూవీ మేకర్స్ వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కీర్తి సురేష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను చాలా బాధపెట్టిన ఒక సంఘటన గురించి ఆమె చెప్పకు వచ్చింది. ఈ సందర్బంగా కీర్తి మాట్లాడుతూ.. ప్రియదర్శన్ సర్ డైరెక్ట్ చేసిన మలయాళ చిత్రంతో హీరోయిన్ గా నా జర్నీ మొదలైంది. అప్పుడు జరిగిన ఒక సంఘటన నాకు చాలా బాగా గుర్తు ఉంది.
ఒక సన్నివేశం షూటింగ్ అయ్యాక ఎంత చెత్తగా చేశావో తెలుసా? వెళ్లి మానిటర్ చూసుకోపో అని తిట్టాడు. అప్పుడు నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు అది మొదటి సినిమా కావడంతో బాగా ఏడ్చేశాను. ఆయన అందరినీ అలానే అనేస్తాడు. ఆయన కూతురు, నటి కళ్యాణి ప్రియదర్శని కూడా అలాగే తిట్టారు. కానీ ఉప్పుకప్పురంబు డైరెక్టర్ అని శశి మాత్రం నటీనటులకు చాలా స్వేచ్ఛ ఇస్తాడు. ఈయన ఆవేశంతో తిట్టేవరకు పరిస్థితులు చేయిదాటిపోనివ్వను. అప్పటికే ఆయన చెప్పిన సీన్ లో బాగా నటిస్తాను. ఇంకో విషయమేంటంటే ఈ డైరెక్టర్ మంచి నటుడు కూడా! చాలామంది డైరెక్టర్లు చెప్తారు కానీ ఈయన ఎలా యాక్ట్ చేయాలని చేసి చూపిస్తాడు అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.