Keerthy Suresh : ఆ పుకార్లని కొట్టి పారేసిన హీరోయిన్ కీర్తి సురేష్..!

Keerthy Suresh : సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మంచి స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ లలో కీర్తి సురేష్ కూడా ఒకరు. తన “మహానటి” సినిమాతో అయితే తన కెరీర్ లో మళ్ళీ కీర్తి సురేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాగే అందరి హీరోయిన్ లలా కాకుండా ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉండే తన స్టార్ స్టేటస్ తో ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఆమెపై మరోసారి కొన్ని పుకార్లు గుప్పుమన్నాయి. మరి దీనితో ఈమె వాటికి ఒక క్లారిటీ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇక అసలు మేటర్ లోకి వెళితే మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర బిగ్ స్టార్స్ లో ఒకడైన తలపతి విజయ్ మరియు టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి తో ప్లాన్ చేసిన భారీ సినిమా లో ఆమె హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని కొన్ని రోజులుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మరి వీటికే ఆమె స్పందించి అసలు ఇవన్నీ నిరాధారిత పుకార్లు అని నాకు ఎలాంటి ఆఫర్ రాలేదు ఈ వార్తల్లో నిజం లేదని ఆమె కన్ఫర్మ్ చేసింది.